వై. యస్. ఆర్.:
"ఎన్నికలలోన మీ పొత్తు నెన్ని, మీకు
మీ తెలంగాణ నిత్తుము మేము గెలిచి!"
యంచుఁ బలికి, సీమాంధ్రలో ననియెఁ బిదప,
"వలయు ’వీస’ హైద్రాబాదు పట్టణమున!"
ననుచు మాట మార్చెనయ సీమాంధ్ర నేత! (1)
ఎన్. చంద్రబాబు నాయుఁడు:
"మీ తెలంగాణ కనుకూల మెపుడు మేము;
బిల్లు పెట్టిన, మద్దతు నెల్లర మిడి,
తెత్తు మో ప్రజలార! యోటేయుఁ" డనుచుఁ
బలికి, కేంద్ర ప్రకటనమ్ము వఱలఁగ నిడ,
దాని, వెనుకకు మఱలంగఁ దఱిమె నితఁడు! (2)
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి:
"మీ తెలంగాణ యంశమ్ము మేము కాదు,
కేంద్రమే చూడ వలయును! కేంద్ర మెట్టి
నిర్ణయముఁ గైకొనినఁ గాని, నేను కట్టు
బడెద" నంచుఁ బలికి, నేఁడు పలుకుఁ దప్పి,
"వేఱు పడఁ గష్టములు వచ్చు! వేఱు వల"ద
టంచు సీమాంధ్ర వాదమ్ము నెంచి పలికె! (3)
4 కామెంట్లు:
ayyaa gundu gaaru,
manam telangaanaa vaallam, aandhra ane padam bootu ani mana naayakudu kcr gaaru eppudo nishedhinchaaru. mari meerenti, aandhra padya kavitaa ani pettukunnaaru.
ధన్యవాదాలు అజ్ఞాత గారూ. నేనావిషయమే గమనించలేదు. అది తొలగించింతర్వాతనే ఈ వ్యాఖ్య రాస్తున్నాను.
లక్షలు విలువ చేసే మాటలు కేవలం 3 కవిత్వాల్లో చెప్పారు.
ధన్యవాదాలు స్వామిగారూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి