గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 17, 2015

వైరుధ్యాలకు అతీతంగా...


 
అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో వేళ్లూనుకొని ఉన్న దోపిడీ నుంచి బయటపడగలిగిన నాడే సామాజిక తెలంగాణ కాని, బంగారు తెలంగాణ కాని సాధ్యం. లెనిన్ చెప్పినట్లు మనవారికి, శత్రువులకు మధ్యవ్యత్యాసం గ్రహించినప్పుడే సరైన దృక్పథం అలవడుతుంది. అప్పుడే మనం కలలుగన్న తెలంగాణ సాధ్యమవుతుంది.

వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లోకి రావడాన్ని ఫిరాయింపుగానో, నీతిమాలిన చర్యగానో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చరిత్రలో జరిగిన వివిధ రకాల రాజకీయ పునరేకీకరణలను, ఫిరాయింపులను విశ్లేషించుకోవలసిన అవసరం ఉన్నది. మావో అన్నట్లు స్పష్టమైన రాజకీయ దృక్పథం లేనివాడు ఆత్మలేని వాడితో సమానం.


స్వాతంత్య్ర పోరాటం అనంతరం మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన మంత్రి మండలిలోకి కాంగ్రెస్‌ను, వ్యక్తిగతంగా తనను వ్యతిరేకించిన వివిధ పార్టీల నేతలను ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించి కొత్తగా ఏర్పడిన దేశానికి తమవంతు సహకారం అందించాలి అనే సదుద్దేశంతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ (షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ) న్యాయశాఖమంత్రిగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (హిందూ మహాసభ అధ్యక్షులు), పరిశ్రమల మంత్రిగా, బాలదేవ్ సింగ్ (ప్యాంథిక్ పార్టీ), రక్షణమంత్రిగా నెహ్రూతో పాటు 1947 ఆగస్టు 15న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మహానుభావులు ఆ రోజు చేసింది పార్టీ ఫిరాయింపుగా ఆ నాటి రాజకీయ పార్టీలు గాని నాయకులు గాని, ప్రజలు గాని చూడలేదు. స్వతం భారతదేశంలో సవాళ్లను స్వీకరించడానికి జరిగిన రాజకీయ పునరేకీకరణగా, ప్రజలు, చరిత్రకారులు శ్లాఘించారు. ఆ రోజు, ఆ మహానేతలు తమ వ్యక్తిగత, పార్టీ అభిప్రాయాలను, ఆవేశాలను పక్కనబెట్టి దేశం కోసం ఏకమైన మహత్తర ఘట్టం.


దాదాపు 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులను తెలంగాణ పోరాటం చూసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రపార్టీలు, ఆంధ్ర ప్రాబల్యమున్న జాతీయ పార్టీలు తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే ఎన్నో కుట్రలు చేశాయి. దీన్ని చూడలేని వివిధ పార్టీల్లో ఉన్న కొందరు తెలంగాణ నాయకులు, ఆయా పార్టీల తెలంగాణ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌లో చేరారు. మరికొంతమంది నాయకులు వారి పార్టీల్లోనే ఉంటూ అంతర్గతంగా తెలంగాణ కోసం పోరాడారు. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్ణాలు అనేక కుట్రలను ఛేదించి తెలంగాణను సాధించాయి.


తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఆంధ్రపార్టీలు, ఆంధ్ర ప్రాబల్యమున్న జాతీయ పార్టీలు తెలంగాణ మీద తమ కుట్రలను కొనసాగిస్తున్నాయి. ఇక్కడ రాజకీయ అస్థిరత్వం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయా పార్టీల్లో ఉన్న కొంతమంది నాయకులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదామనే తలంపుతో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తెలంగాణలోని అన్ని రాజకీయ శక్తులు సంఘటితమై తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి.


గడిచిన సంవత్సరకాలంలో టీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ హక్కుల గురించి పోరాటంతో తెలంగాణ వ్యాన్‌గార్డ్‌గా ఉందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజాకాంక్షను పట్టని పార్టీలను, నాయకులను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది. తెలంగాణ హక్కుల గురించి మాట్లాడని, పోట్లాడని నాయకులు, పార్టీలు ఏ విధమైన రాజకీయం చేసినప్పటికీ ప్రజల ఆదరణ పొందలేరు.


1983లో కాంగ్రెస్ మంత్రిగా ఉన్న చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవం అనే ఎజెండాతో రాజకీయాల్లోకి వచ్చిన మామ అయిన ఎన్టీఆర్‌పై పోటీకి సిద్ధం అని ప్రకటించాడు. ఎన్టీఆర్ ప్రభంజనంలో చిత్తుగా ఓడిన చంద్రబాబు కొన్ని రోజులకు టీడీపీలో చేరడం ఫిరాయింపు కాక మరేమిటి?


1995లో చంద్రబాబు ఎన్టీర్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి, పదవీచ్యుతున్ని చేసి తాను అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని ఫిరాయించినట్లు కాదా?


10 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి వైఎస్సార్. ఆయన స్ఫూర్తితో కుమారుడు జగన్ పెట్టుకున్న పార్టీ వైఎస్సార్సీపీ.


గౌతమ బుద్ధుడు ధర్మానికి పరిభాష్యం చెబుతూ బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ధర్మమే అని గుర్తించాలి.


కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన యూనైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్‌లలో టీడీపీ భాగస్వామి కాలేదా?.
తెలంగాణ అనుకూల శక్తులను తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్‌ఎస్ ఒక్కటిచేసి తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదించాలి. ఇలాంటి ఏకీకరణకు సహకరించడం ప్రతి వ్యక్తి, నాయకుడి నైతిక బాధ్యత.


అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో వేళ్లూనుకొని ఉన్న దోపిడీ నుంచి బయటపడగలిగిన నాడే సామాజిక తెలంగాణ కాని, బంగారు తెలంగాణ కాని సాధ్యం. లెనిన్ చెప్పినట్లు మనవారికి, శత్రువులకు మధ్య వ్యత్యాసం గ్రహించినప్పుడే సరైన దృక్పథం అలవడుతుంది. అప్పుడే మనం కలలుగన్న తెలంగాణ సాధ్యమవుతుంది.



గురువారం, జులై 16, 2015

టీడీపీ అబద్ధాల సాగు!

-ప్రాజెక్టును అడ్డుకోవాలని సీడబ్ల్యూసీకి లేఖ రాయలేదా?
-డీపీఆర్‌లు మాత్రమే అడిగామని టీడీపీ సమర్థన
-తిన్నింటి వాసాలు లెక్కపెడితే పుట్టగతులుండవ్
-టీడీపీ వైఖరిపై తెలంగాణవాదుల ఆగ్రహం
-పాలమూరును చంద్రబాబు అడ్డుకోలేదా?
-అవి కొత్త ప్రాజెక్టులు.. విభజన చట్టానికి వ్యతిరేకం
-వాటి నిర్మాణాన్ని చేపట్టవద్దు
-ప్రజా ప్రయోజనాలకు ఆ ప్రాజెక్టులు విరుద్ధం
-ఇదీ చంద్రబాబు లేఖల సారాంశం
గతేడాది తెలంగాణలో ఎన్నికల పంట ఎండిపోవడంతో ఈసారి అబద్ధాల సాగు మొదలుపెట్టింది టీడీపీ! పసలేని వాదనలు ప్రవహింపజేస్తూ.. కలుపు మొక్కలు పెంచుతున్నది! అసత్యాలు.. బుకాయింపులు.. తెలంగాణ వ్యతిరేకత.. కనికట్టు సమపాళ్లలో జోడించి.. ఎరువుగా వేస్తున్నది! ఒకవైపు టీడీపీ అధినేత, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని బాహాటంగా గొంతు చించుకుంటుంటే.. తెలంగాణ ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని ఢిల్లీకి వెళ్లి మరీ చెప్తుంటే...తెలంగాణలోని టీడీపీ నేతలు ఖండించాల్సింది పోయి.. అబ్బే.. బాబు అసలు అలా అననే లేదు అంటూ బుకాయిస్తున్నారు! బాబుకు ఆ ఉద్దేశమే లేదంటూ వెనకేసుకొస్తున్నారు! 


babu


మరోవైపు పాలమూరును ఉద్ధరించిందే తామని బల్ల గుద్దుతున్నారు! కీలక ప్రాజెక్టులు తామే ప్రారంభించామని గప్పాలు కొడుతున్నారు! ఆ ప్రాజెక్టులు పదేండ్ల టీడీపీ హయాంలో ఎందుకు మూలపడ్డాయి? వాటికి కేటాయించినదెంత? అని నిలదీస్తే.. చల్లగా జారుకుంటున్నారు! సవాలు విసిరి చర్చకు రమ్మన్నా.. రాంరాం అంటున్నారు! తాము తెలంగాణలో ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే తమకు పరమావధని చెప్పకనే చెప్తున్నారు! తమది ఆంధ్ర పార్టీయేనని నిరూపించుకుంటున్నారు! వీళ్ల వ్యవహారం చూసిన తెలంగాణవాదులు.. అసలు వాళ్లు ఈ గడ్డ బిడ్డలేనా? అని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు!!


ఒకవైపు తెలంగాణను ఎండబెట్టాలని, పాలమూరు జిల్లాకు ఉరి వేయాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తుంటే.. తెలంగాణ టీడీపీ నాయకులు ఆ ప్రయత్నాలకు వత్తాసు పలుకుతున్నారు. ఏపీ సీఎం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే కండ్ల్లుమూసుకుని.. అవాస్తవాలు వల్లెవేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నవి కొత్త ప్రాజెక్టులని, విభజన చట్టానికి అవి వ్యతిరేకమని, వాటిని చేపట్టరాదని, అవి ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని చంద్రబాబు తన లేఖల్లో రాస్తే.. చంద్రబాబు ఆ విధంగా లేఖ రాయలేదని.. అసలు ఆయనకు ఆ ఉద్దేశమే లేదని కళంకిత టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. 


సాక్ష్యాలు కండ్లముందు కనిపిస్తున్నా.. వాటి జోలికి వెళ్లకుండా మాటలతో మాయ చేస్తున్నారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు ఆపాలని ఇటీవల చంద్రబాబు సీడబ్ల్యూసీకి లేఖ రాయడం.. దానిపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమనడం తెలిసిందే. చంద్రబాబు ప్రయత్నాలను జనం వ్యతిరేకిస్తున్నారన్న సోయి కూడా లేకుండాపోయిన టీడీపీ తెలంగాణ నేతలు.. బాబు భజన చేయడంపై తెలంగాణవాదులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. 


ఉద్యమకాలంలో రాష్ట్రసాధన ప్రయత్నాలకు చంద్రబాబు గండి కొట్టినప్పుడు ఆయనను వెనకేసుకు వచ్చిన ఆ పార్టీ నేతలు.. ఇప్పటికీ తమ తీరు మార్చుకోకపోగా.. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం పెల్లుబుకుతున్నది. కనీసం అబద్ధాలు ఆడేటప్పుడైనా అతికెటట్లు చూసుకుని ఎన్ని కుప్పిగంతులైనా వేసుకోవాలని, లేదంటే తల బొప్పి కట్టడం ఖాయమని హితవు పలుకుతున్నారు.


ఆపాలన్నది నూరుపాళ్ల వాస్తవం


పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను ఆపాలని చంద్రబాబు కోరింది నూటికి నూరుపాళ్లు వాస్తవం. సీడబ్ల్యూసీకి రాసిన లేఖ అందుకు తిరుగులేని సాక్ష్యం. కృష్ణానదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ పరిశీలనకు తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు సమర్పించాలి. సదరు సంస్థలు వాటిపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి వచ్చేవరకు ఆ ప్రాజెక్టుల (పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు) పనులను చేపట్టనీయొద్దు. తెలంగాణ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ఏవైనా పనులు చేపట్టినట్లయితే వాటిని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం నిలువరించాలి అని చంద్రబాబు తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. 


ఇదే లేఖలోని ఏడో పేరాగ్రాఫ్‌లో అసలు ఈ ప్రాజెక్టులు ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి ఇదే విషయం ఫిర్యాదు చేశారు. కానీ.. దీనికి మసిబూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నించిన టీడీపీ తెలంగాణ నేత రేవంత్‌రెడ్డి.. పాలమూరు పథకాన్ని నిలువరించాలని చంద్రబాబు చెప్పలేదని నిస్సిగ్గుగా వాదిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపమని చంద్రబాబునాయుడు లేఖ రాయలేదు. కేంద్ర జల సంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కేవలం డీపీఆర్‌లు మాత్రమే సమర్పించాలని లేఖ రాసిండు అని రేవంత్ బుకాయిస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న వాదన పచ్చి బూటకం అనేందుకు మూడు లేఖలు కళ్లముందు ఉన్నాయి. కేంద్ర జల సంఘం, కేంద్ర జలనవరుల మంత్రిత్వ శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఒకసారి లేఖ రాసిన చంద్రబాబు సర్కారు.. ఆపై తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆ సారాంశంతో మరో లేఖ రాసింది. 


వీటికి తోడు ఏపీ రాసిన లేఖ సారాంశాన్ని ఉటంకిస్తూ కేంద్ర జల సంఘం తెలంగాణ ప్రభుత్వానికి మరో లేఖ పంపింది. వీటన్నింటినీ పరిశీలిస్తే అర్థమయ్యేది ఒక్కటే.. పాలమూరు, డిండి పథకాలను వెంటనే నిలిపివేయాలనేది ఏపీ సర్కారు డిమాండ్. అక్కడితో ఆగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్టులతో ఎగువ రాష్ర్టాల హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ ఇతర రాష్ర్టాలను కూడా తెలంగాణపైకి ఎగదోసే కుట్రకు పాల్పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వలసల జిల్లా అయిన మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేసేందుకు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు విముక్తి కల్పించేందుకు పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నది. 


కానీ.. అవి ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఒకవైపు టీడీపీ అధినేత బాహాటంగా చెలరేగుతుంటే.. టీడీపీ తెలంగాణ నేతలు మాత్రం ఇంకా చంద్రబాబు చర్యలను సమర్థిస్తూనే మాట్లాడుతుండటం విశేషం. పొడిపొడి మాటలతో బుకాయిస్తున్న ఇక్కడి టీడీపీ నేతలు ఈ వాస్తవాలను ఎందుకు గుర్తించడం లేదని తెలంగాణవాదులు నిలదీస్తున్నారు. కేంద్రం, కేంద్ర జల వనరుల శాఖ, ఇతర నీటి సంస్థలకే కాదు.. ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలోనూ పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టడం పద్ధతి కాదని, అక్రమమని రాశారు. 


కేంద్ర జల సంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆ లేఖల్లో స్పష్టంగా ఉంది. అయినా తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం మంచోడు మా బాబు.. అంటూ ఆయనను వెనకేసుకురావడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా.. చంద్రబాబుకు ఆ ఉద్దేశమే లేకపోతే కేంద్ర జల వనరుల శాఖకు పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై ఎందుకు లేఖ రాశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవిగో సాక్ష్యాలు..


కేంద్ర జల వనరుల శాఖతో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్, కేంద్ర జల సంఘం కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ నంబర్-13898/ఐఎస్.ఈఏ/2015, తేదీ 11.06.2015 లోని ఆరో పేరాగ్రాఫ్‌లో ఇలా ఉంది.. Until all the said authorities duly grant their approval and duly after considering views of AP on the said DPR, State of Telangana can not undertake any construction work for implementation projects mentioned in news item. Any such act on part of State of Telangana contrary to mandate of A.P. Reorganization Act, 2014 are to be restrained from undertaking such activity.


ఇదే లేఖలో ఏడో పేరాగ్రాఫ్ ఇలా ఉంది. It is a matter of serious concern not only to the State of A.P., but also for the K.R.M.B., Apex Council, CWC and the Central Government and would be contrary to public interest.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫిర్యాదు ఆధారంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి గత నెల 17న ఒక లేఖ పంపింది. 


అందులో... In the letter, Principal Secretary, Govt. of Andhra Pradesh has contended that unilaterally proceeding with construction of any new project on river Krishna without the approval of Krishna River Management Board and the Apex Council would tantamount to violation of principles laid down in A.P. Reorganization Act, 2014. అని ఉంది. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర జల సంఘం రాసిన లేఖలో చంద్రబాబు లేఖ సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పింది. 


కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు కడుతున్నదంటూ ఏపీ వాదిస్తున్నందున, మీ అభిప్రాయాలు చెప్పండంటూ కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ నవీన్ కుమార్ తన లేఖలో కోరారు. కానీ.. ఇవేవీ తెలంగాణ టీడీపీ నాయకులకు కనిపించకపోవడం విశేషం.


అసలు వీళ్లు తెలంగాణ బిడ్డలేనా?!


చంద్రబాబు, ఆయన ప్రభుత్వం రాసిన లేఖలను చూసిన తర్వాత కూడా ఏపీ ప్రయోజనాలకే కొమ్ము కాస్తున్న తెలంగాణ టీడీపీ నేతలు అసలు ఈ గడ్డ బిడ్డలేనా? అని అనుమానం కలుగుతున్నదని టీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఖ చూడగానే.. ఈ గడ్డ మీద పుట్టిన ఎవరైనా చంద్రబాబును నిలదీస్తారని, కానీ టీడీపీ నేతలు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ అడిగేందుకు కూడా సాహసించలేక పోతున్నారని, దీనిని బట్టి వాళ్లెంత బానిస మనస్తత్వంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. చంద్రబాబు ఈ రెండు ప్రాజెక్టులు కొత్తవని చెప్తున్నారని, దీనిపై టీడీపీ తెలంగాణ నేతల వైఖరేంటని వారు డిమాండ్ చేస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



మంగళవారం, జులై 14, 2015

ఆర్టికల్ 163.. సెక్షన్ 8 ఒక్కటే...!!!

-అదనంగా చేరింది కొన్ని పదాలే
-గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలేమీ లేవు
-తేల్చి చెప్తున్న న్యాయవాదులు
లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేయడంలో ఏపీ నేతలది అందెవేసిన చెయ్యి! ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం విషయంలో వారు మరోసారి ఆ ప్రయత్నం చేసేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే విభజన చట్టంలోని సెక్షన్ 8, రాజ్యాంగంలోని 163వ ఆర్టికల్ వేర్వేరనే ప్రచారాన్ని అందుకున్నారు. నిజానికి ఈ రెండింటికీ పెద్దగా తేడా లేదు. రాజ్యాంగంలోని 163వ అధికరణంలో పేర్కొన్న అంశాలకు కొన్ని పదాలు జోడించి ఏపీ విభజన చట్టంలోనూ చేర్చడం విశేషం. అంతేకానీ.. గవర్నర్‌కు ప్రత్యేకంగా అదనపు అధికారాలేమీ కట్టబెట్టలేదు. ఏపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని వివాదం చేస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు, న్యాయవాదులు స్పష్టంచేస్తున్నారు. 


page


ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్8లో సైతం తెలంగాణ మంత్రిమండలి సలహా ప్రకారం గవర్నర్ వ్యవహరించాలని పేర్కొన్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(1) ప్రకారం పేర్కొన్న అంశమేనని వారు తేల్చి చెప్తున్నారు. కొత్తగా సలహాదారుల ఏర్పాటు అంశాన్ని సెక్షన్ 8లో ప్రస్తావించారని వారు తెలిపారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు సెక్షన్ 8 అంశాన్ని వివాదం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.


-సెక్షన్8పై అనవసర రాద్ధాంతంసెక్షన్ 8లోని అంశాలు దాదాపుగా ఆర్టికల్ 163తో సమానంగా ఉన్నాయి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వానికే కల్పించారు. రాష్ట్ర మంత్రిమండలి సూచనలు, సలహాలమేరకే గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయాలను ఆర్టికల్ 163 (1)లో స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాన్ని కట్టబెట్టారు. ప్రస్తుతం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్ 8పై కొంతమంది వ్యక్తులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. 



page1


ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్8లో సైతం తెలంగాణ మంత్రిమండలి సలహా ప్రకారం గవర్నర్ వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(1) ప్రకారం పేర్కొన్న అంశమే. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్ సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్‌కు సలహాలు ఇచ్చేందుకు ఇద్దరు సలహాదారులను నియమించాలనే అనే అంశాన్ని సెక్షన్8లో పేర్కొన్నారు. అంతేకానీ సెక్షన్ 8 అమలు చేయగానే.. హైదరాబాద్‌పై పూర్తి అధికారం గవర్నర్‌కు సంక్రమిస్తుందని చెప్పడం సరికాదు.
- అరుణ్, న్యాయవాది


-సెక్షన్ 8పై అవగాహన తెచ్చుకోవాలిఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన తర్వాత అందులోని సెక్షన్ 8పై ప్రస్తుతం అవగాహన లేకుండా ఏపీ నేతలు మాట్లాడుతున్నారు. సెక్షన్ 8లో హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు సంక్రమిస్తాయని పేర్కొనలేదు. ఆర్టికల్ 163లో పేర్కొన్న అంశాలనే సెక్షన్ 8లో పేర్కొన్నారు. ఉమ్మడి హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల సమస్య, ఇతర అల్లర్లు, తగాదాలు వచ్చిన, శాంతి భద్రతలు క్షీణించిన సమయంలోనే గవర్నర్‌కు సొంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. అప్పుడుసైతం గవర్నర్‌కు సలహాలు ఇచ్చేందుకు ఇద్దరు సలహాదారుల ఏర్పాటు విషయాన్ని సెక్షన్ 8లో పేర్కొన్నారు.
- రవీందర్‌రెడ్డి, న్యాయవాది


-ఇప్పుడు సెక్షన్-8 అమలులోనే ఉందిహైదరాబాద్‌లో ప్రస్తుతం సెక్షన్ 8 అమలులోనే ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన ఈ సెక్షన్‌కు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 163కి ఏ మాత్రం తేడా లేదు. ఇక్కడ ఉండే తెలంగాణవాసులే కాదు.. ఇతర రాష్ట్ర ప్రజల హక్కులకూ ఎలాంటి భంగం వాటిల్లడం లేదు. పునర్వ్యవస్థీకరణ చట్టం రూపొందించే సమయంలోనే ఈ సెక్షన్‌ను మేం వ్యతిరేకించాం. అరవయ్యేండ్లు కలిసి ఉన్న వారిని ఇకముందు కూడా గౌరవంగా చూసుకుంటామే తప్ప ఎందుకు గొడవలు పెట్టుకుంటామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ సెక్షన్ అవసరంలేదని చెప్పాం. చేతల్లో చూపిస్తున్నాం. కేవలం ఏపీ సీఎం చంద్రబాబు నోటుకు ఓటు వ్యవహారంనుంచి తప్పించుకునేందుకు ఇన్నాళ్లూ గుర్తుకు రాని సెక్షన్‌ను తెరపైకి తెచ్చారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8లో క్లాజు 3, 4 ప్రకారం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగినపుడు, ఇతర ప్రాంతాల వారికి, వారి ఆస్తులకు అభద్రత ఏర్పడినపుడు గవర్నర్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంతో సంప్రదించి, నిర్ణయాలు తీసుకోవాలని ఉంది. కచ్చితంగా తెలంగాణ మంత్రివర్గ అభిప్రాయాల్ని గవర్నర్ తెలుసుకోవాలని ఉంది. కానీ చంద్రబాబు మాత్రం అధికారం అంతా గవర్నర్ చేతుల్లోకి తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు. నోటుకు ఓటు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్‌ను మేనేజ్ చేయించుకోవడానికే ఆయన ఈ డిమాండు చేస్తున్నారు. 
- వీ శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే


-ప్రజల స్వేచ్ఛకు కించిత్తు భంగమైనా కలిగిందా?పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 8 అయినా, రాజ్యాంగంలోని 163 ఆర్టికల్ అయినా ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించొద్దని చెప్తున్నాయి. హైదరాబాద్‌లోని ఏ ఒక్క వ్యక్తి స్వేచ్ఛకుగానీ, వారి ఆస్తులకుగానీ కించిత్తు భంగం వాటిల్లిందా? అనే దానికి చంద్రబాబు, సెక్షన్ 8కోసం డిమాండు చేస్తున్న వారు సమాధానం చెప్పాలి. 


ఓటుకు నోటు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు చట్టంలోని లేని విధంగా హైదరాబాద్‌లో అధికారాన్ని మొత్తం గవర్నర్ చేతులో పెట్టాలంటూ చంద్రబాబు సీమాంధ్ర ప్రజల్ని మభ్య పెడుతున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, చేయకున్నా.. రాజ్యాంగబద్ధంగా హైదరాబాద్‌లో ఉండే ఎవరి హక్కులకూ ఇబ్బంది తలెత్తదు. ఉద్యమకాలం నుంచి మేం చెబుతున్నట్లు.. అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందాం.. అనే నినాదాన్ని పాటిస్తాం.
- జీవన్‌రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, జులై 13, 2015

"నీ దొంగ ప్రాజెక్టులకు అనుమతులున్నాయా...???" -మంత్రి టి. హరీశ్ రావు ప్రశ్న

-ఏపీలో అనుమతుల్లేని ప్రాజెక్టులకు నీళ్లు నిలిపేస్తావా?
-ఏపీ సీఎంపై విరుచుకుపడిన మంత్రి హరీశ్‌రావు
-ఇంజినీర్లకు చేతినిండా పని కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని వ్యాఖ్య

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలంటూ కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. 2013లోనే రోజుకు రెండు టీఎంసీల చొప్పున 35 రోజులపాటు 70 టీఎంసీలు తీసుకోవచ్చంటూ డీపీఆర్ కోసం ఉమ్మడి ప్రభుత్వం ఈ పథకానికి జీవో ఇస్తే, దానిని చంద్రబాబు కొత్త ప్రాజెక్టు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏపీలో హంద్రీనీవా, గాలేరు నగరి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా?అని నిలదీశారు. ఒకవేళ అనుమతులు లేని ఆ ప్రాజెక్టులకు నీళ్లు నిలిపివేస్తే మేము కూడా ఆలోచిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

harish



అందుకు సిద్ధమేనా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇంజినీరింగ్ రంగ నిపుణుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్‌వాసులకు తాగునీళ్లు ఇచ్చేందుకు చంద్రబాబు అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు 299 టీఎంసీల నీటిని కేటాయించిందని, ఇంకా వాటా కోసం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌పై తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఆగస్టులోపు హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఏ అనుమతులతో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి కేటాయింపులు కేవలం రాష్ర్టాలకు సంబంధించిన విషయమని, ఏ ప్రాంతానికి, ఏ ప్రాజెక్టుకు నీటిని కేటాయిస్తారనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని గతంలోనే కేంద్రం, సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


ఆదివారం, జులై 12, 2015

సాంకేతిక కళాశాలల దారెటు?

పాత వ్యవస్థను మార్చేందుకు తెలంగాణ రాష్ర్టాన్నే పోరాడి తెచ్చుకోవటం జరిగింది. ఇపుడు పునర్నిర్మాణం దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను నెలకొల్పాలని ఐటీ మంత్రి కేటీఆర్ కృషి మొదలు పెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కూల్‌ను నిర్మించేందుకు నిష్ణాతులతో ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ గ్రూప్‌ను పెట్టాలన్న ఆలోచనలున్నట్లు చెబుతున్నారు.అందుకోసం కేటీఆర్ తనదైన శైలిలో కృషి మొదలుపెట్టారు. 

juluru


ఇంజినీరింగ్ విద్యపై వివిధ దేశాలలో జరుగుతున్న పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచుతున్నాయి. సెల్ ఇంజినీరింగ్‌లో పరిశోధనలు జరుగుతున్న ఈ సమయంలో మన దగ్గర ఇంజినీరింగ్ కాలేజీలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్న అనేకసార్లు వచ్చింది. మన రాష్ట్రంలో ఏటా ఎంతో మంది ఇంజినీర్లను తయారు చేయటం గొప్ప విషయమే. కానీ ఆ చదువులో వారి ప్రమాణాల గురించి ఆలోచిస్తే ఆందోళన కలుగుతున్నది.
ఎంసెట్ కౌన్సెలింగ్, అఫిలియేషన్ల గొడవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జేఎన్టీ యూ నిర్వహణ, ఉన్నత విద్యామండలి నడక, పరీక్షల వాయిదాలు, కోర్టు వివాదా లు, సీట్ల కోత, సీట్ల పెరుగుదల తదితర అంశాల చుట్టూతా ఇంజినీరింగ్ విద్యను తిప్పుతున్నారు. సీట్ల కోతపై, కౌన్సెలింగ్ ఆలస్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై జరిగే చర్చ ఇంజినీరింగ్ విద్యలో నాణ్యతపై జరగకపోవటం విచారకరం. పాలనాపరమైన విషయాలపై జరిగే చర్చలే ఇంజినీరింగ్ విద్యను కమ్మేయటంతో అసలు మన ఇంజినీరింగ్ విద్య ఎటు పోతుందోనన్న సంశయం ఆలోచనాపరులను వెంటాడుతున్నది. ఇక్కడ వందలాది కాలేజీలున్నా పరిశోధనలు మాత్రం జరగటం లేదు. కళ్ల ముందున్న అనేక సమస్యలకు విరుగుళ్లను శాస్త్ర సాంకేతిక రంగాలు కనిపెట్టాలి. ప్రజల కన్నీళ్లను తుడిచేందుకే సాంకేతిక విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతున్నట్లు తొలి ప్రధాని నెహ్రూ చెప్పారు. ఉన్నత ఆశయాలతో ఇంజినీరింగ్ కాలేజీలు, ఐఐటీలు నెలకొల్పారు. కానీ ఆచరణలో అవి క్రమంగా నాణ్యతలేని కాలేజీలుగా మారుతున్నాయి. వందల సంఖ్యలో కాలేజీలున్నా పరిశోధనలు ఎందుకు జరగటం లేదంటే మన కాలేజీలన్నీ బ్యాచిలర్ డిగ్రీ కాలేజీలు అని దాటవేస్తున్నారు. పరిశోధనలు చేయవలసిన పాత్ర మాది కాదు అని కాలేజీలు పక్కకు తప్పుకుంటున్నాయి. దీంతో మన ఇంజినీర్లు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారు. ఆ వలస పోయేందుకు కూడా కావాల్సిన నైపుణ్యాలు లేక లక్షలాదిమంది సాంకేతిక నిరుద్యోగ సైన్యంగా మారిపోతున్నారు. వీళ్లందరికీ ఉద్యోగాలు ఏ ప్రభుత్వాలు ఇవ్వలేవన్నది సత్యమే. కానీ కనీసంగా నైపుణ్యమున్న మానవవనరులుగా తీర్చిదిద్దలేకపోవటమే ఈ వ్యవస్థలో మరో ప్రమాదకర సంకేతంగా మారిపోతున్నది. దీనికి కారకులెవరన్నది ప్రశ్న కాదు. ఇప్పటికైనా సాంకేతిక కళాశాలలు స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలుగా మారవలసిన అవసరం ఉన్నది. ట్రిపుల్ ఈ చదువుకున్న విద్యార్థి కనీసం ఇంటి దగ్గర కరెంటు ఫ్యూజు పెట్టుకోలేని పరిస్థితి. కనీస ఆచరణకు పనికిరాని చదువుగా మారింది. 


ప్రజా ధనంతో నడుస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలు ప్రజా సమస్యలకు విరుగుడుగా సాంకేతిక విద్యను మలచవలసి ఉన్నది. ఆ పని ఎన్ని ఇంజినీరింగ్ యాజమాన్యాలు చేస్తున్నాయి. ఈ కాలేజీలున్న పరిసర ప్రాంతాలలో వడ్రంగి పని చేసేవాళ్లు తమ జీవనానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు కృషి చేయకపోగా, అనేక ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చైనాకు పోయి అక్కడ నుంచి కాలేజీకి కావాల్సిన కుర్చీలు, బల్ల్లలు, బ్లాక్ బోర్డులు, టేబుళ్లు దిగుమతి చేసుకుంటున్నాయి. అది కారు చౌకగా వస్తుండవచ్చును. కాలేజీలకు ఫర్నీచర్‌ను ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే వడ్ల కమ్మరులు ఆత్మహత్య చేసుకుంటుంటే వారి వృత్తిని ఆధునికీకరించే పరిశ్రమలను నెలకొల్పేందుకు పరిశోధనలు చేసి ప్రభుత్వానికి, వృత్తిదారులకు అండగా నిలవాల్సిన నైతిక బాధ్యత సాంకేతిక విద్యారంగానికి ఉన్నది. చైనాలో కొబ్బరి టెంకలతో ఫర్నీచర్ తయారు చేశారు. అలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మన సాంకేతిక విద్యారంగం ఇప్పటివరకు ఏ రకమైన కృషి చేసింది? మన ఇంజినీరింగ్ కాలేజీలలో పరిశోధనలు జరిగితే ప్రపంచం స్టాన్‌ఫర్డ్ వైపు కాదు, తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది.


పరిశోధనలకు బీజాలు వేసి విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దవలసిన ఉన్నత విద్యామండలి గత దశాబ్ద కాలంగా గురకబెట్టి నిద్రపోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాత స్థితిని మార్చివేసి కొత్త నిర్మాణం చేయటానికి కేసీఆర్ తాపత్రయ పడుతున్నారు. ఉన్నత విద్యామండలి ఆయన ఆలోచనలను అమలులోకి తేవాలె. తెలంగాణ రాష్ట్రం కోసం గూగుల్ రెండవ ప్రధాన కార్యాలయం హైద్రాబాద్‌లో నెలకొల్పేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. అందుకు కావాల్సిన సాంకేతిక విద్యా పరిపుష్టిని ఇచ్చే విధంగా మన విద్యారంగాన్ని తీర్చిదిద్దాలె. 


జేఎన్టీయూ ఏర్పడిన నాటి నుంచి వేల సంఖ్యలో పరిశోధనలు జరిగాయి. కానీ అందులో సీరియస్ పరిశోధనలు ఎన్నంటే వేళ్లమీదనే లెక్కించవలసి వస్తుంది. ఇక పరిశోధన అంటే దాదాపుగా ఐఐటీలదే అయ్యింది. మన జేఎన్టీయూ పరిధిలో వేల సంఖ్యలో పరిశోధనలు జరిగినప్పటికీ ఆరు పరిశోధనలకు మాత్రమే పరిశ్రమలు పెట్టుకునేందుకు పేటెంట్‌లు వచ్చాయని అంటున్నారు. జేఎన్టీయూ ఉస్మానియా విశ్వవిద్యాలయాల నుంచే పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. కానీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలలో పరిశోధనలు అంతగా జరుగలేదు. 


తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత గతం కంటే భిన్నంగా వేగవంతంగా పరిశోధనలు కొనసాగించవలసి ఉంది. పరిశోధనలను పరిశ్రమలకు అనుసంధానం చేయవలసి ఉన్నది. సమాజ కల్యాణం కోసం ఆ పరిశోధనలను అంకితం చేసే విధంగా, ఉత్పత్తికి అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఉండాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విధంగా నూతన పరిశ్రమలను మన సొంత టెక్నాలజీతో నిర్మించుకోవాలె. తెలంగాణ నేలలో సహజ సంపదలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని ఉత్పత్తి వైపుకు మళ్లించగలగాలె. నల్లగొండ జిల్లా కృష్ణపట్టె ప్రాంతంలో కావల్సినంత సున్నపురాయి ఉన్నది. అది మరో 200 సంవత్సరాల వరకు సిమెంటు పరిశ్రమలకు సరిపోతుంది. దీంతో నల్గొండ జిల్లా సిమెంట్ క్యాపిటల్‌గా మారింది. అక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ ఇంజినీరింగ్‌పై కాలేజీలు పెట్టాలె. 


ఆదిలాబాద్ నేలలో ఎన్నెన్నో విలువైన ఖనిజాలున్నాయి. వాటిని వెలికి తీసేందుకు పెద్ద ఎత్తున పరిశోధనలు జరుపాల్సి ఉన్నది. ఇందుకోసం అక్కడ ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు వెలయాలి. కరీంనగర్ అన్నది గ్రానైట్ మైన్ క్యాపిటల్‌గా మారింది. ఆ మైనింగ్‌పైన పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో పెడితే తెలంగాణ సకల సంపదలతో తూగుతుంది. కరీంనగర్ వరి పంటలో అగ్రస్థానంలో ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు కేంద్రంగా ఉంది. ఖమ్మం గ్రానైట్ సంపదకు నిలయంగా ఉంది. మహబూబ్‌నగర్‌లో గరుకునేలపైకి గంగమ్మను తీసుకురావాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లాలో వున్నన్ని ఖాళీస్థలాలు దేశంలో మరెక్కడా లేవు. వరంగల్ జిల్లాలో అటవీ సంపద, గోదావరి తీర ప్రాంతం ఉంది. మెదక్ జిల్లా అత్యధిక పరిశ్రమలు నెలకొల్పబడ్డ ప్రాంతం. 


తెలంగాణ 10 జిల్లాల్లో కావాల్సినన్ని సహజ వనరులు, సంపదలు ఉన్నాయి. అట్లాగే పేరుకు పోయిన సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి విరుగుళ్లుగా పరిశోధనలు జరగాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధతో దూసుకువస్తున్నారు. ఈ సందర్భంలో తెలంగాణను సంపద గల ప్రాంతంగానే గాక పరిశోధనలకు కూడా తిరుగులేని ప్రశస్తిగల తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలి. ఇంజినీరింగ్ కాలేజీలు ఈ బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకోవాలి. నాణ్యమైన విద్యను అందించటం సాంకేతిక విశ్వవిద్యాలయం బాధ్యత. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సమస్యలు లేవనటం లేదు. కానీ ఇప్పుడు తక్షణం పిల్లలకు నాణ్యమైన విద్య అందాలి. నాణ్యమైన విద్యతోపాటుగా స్కిల్ రీసెర్చ్ జరగాలి. మనదేశంలో ఇప్పటి వరకు సుమారు 300 రకాల స్కిల్స్ ఉన్నాయని గుర్తిస్తే అమెరికాలో 3000 రకాల స్కిల్స్‌ను గుర్తించారు. వీటిపైన ఆ దేశంలో శిక్షణనిస్తున్నారు. అమెరికాలో టప్పా విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంటు స్కూల్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. 


పాత వ్యవస్థను మార్చేందుకు తెలంగాణ రాష్ర్టాన్నే పోరాడి తెచ్చుకోవటం జరిగింది. ఇపుడు పునర్నిర్మాణం దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను నెలకొల్పాలని ఐటీ మంత్రి కేటీఆర్ కృషి మొదలు పెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కూల్‌ను నిర్మించేందుకు నిష్ణాతులతో ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ గ్రూప్‌ను పెట్టాలన్న ఆలోచనలున్నట్లు చెబుతున్నారు. అందుకోసం కేటీఆర్ తనదైన శైలిలో కృషి మొదలుపెట్టారు. ఒక్కొక్క జిల్లా ముఖచిత్రం మార్చివేసేందుకు ఆ జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా, అక్కడి భౌతిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్కిల్ డెవలప్‌మెంట్ చేయవలసి ఉన్నది. ప్రతిభావంతులు ఎక్కడైనా నెగ్గుకొస్తారు. జిల్లాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థానికత దృష్టిలో విస్తృత పరిశోధనలు చేయవలసి ఉన్నది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శనివారం, జులై 11, 2015

నేను చేస్తే శృంగారం...మీరు చేస్తే వ్యభిచారం...!!!

....ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు "బాబు" బేరం...!!!

-వికీలీక్స్‌లో ఏపీ సర్కారు బాగోతం
-ఓర్టస్ కన్సల్టింగ్ కంపెనీతో ఏపీ ఇంటెలిజెన్స్ సంప్రదింపులు
-సింగపూర్ హ్యాకింగ్‌టీమ్‌కు బాధ్యతలు అప్పగించిన ఓర్టస్
-7.5 కోట్లకు ప్రాథమిక అంచనాలు పంపిన హ్యాకింగ్‌టీమ్
-ప్రభాకర్, మగ్లిట్టా మధ్య మెయిల్స్‌ను బయటపెట్టిన వికీలీక్స్
-మరోసారి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
-ట్యాపింగ్ తీవ్రమైన నేరమని కోడైకూసిన సీమాంధ్ర మీడియా
-వికీలీక్స్ సమాచారానికి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత
-బాబు వ్యవహారంపై భగ్గుమంటున్న తెలంగాణవాదులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాగోతం బయటపడింది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నదంటూ గగ్గోలు పెడుతూనే అదే సమయంలో సెల్‌ఫోన్లు, ఈ మెయిల్ సమాచారాన్ని దొంగచాటుగా ట్యాపింగ్ చేసే టెక్నాలజీని సమకూర్చుకునేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీ సంస్థద్వారా బేరసారాలు నడిపింది. సుమారు 7.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ టెక్నాలజీ కొనుగోలుకు సిద్ధమైంది. ఈ సంగతులు వికీలీక్స్ పరిశోధనలో బయటపడ్డాయి. 


babu


అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్ల సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని అమ్మే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల మీద నిఘాకోసమంటూ ఈ సంస్థలు అమ్మే సాఫ్ట్ వేర్‌ను చట్టవ్యతిరేక పనుల్లో వాడుతున్నారు. ఇలా అక్రమంగా హ్యాక్ చేసిన సుమారు 10 లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఇందులో చంద్రబాబు సర్కారు బాగోతం వెలుగుచూసింది. సెల్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌ల మీద నిఘా పెట్టే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తెలంగాణ మీద ప్రయోగించేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుంది. సదరు టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థతో సంప్రదింపులు నడిపారు. 


వీరికోసం ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి ఇలాంటి టెక్నాలజీని విక్రయించే "హాకింగ్‌టీమ్.కామ్" అనే సంస్థతో బేరసారాలు జరిపారు. 25నుంచి 50 సెల్‌ఫోన్ల నంబర్లపై ట్యాపింగ్ జరిపేందుకు టెక్నాలజీ కావాలని హాకింగ్‌టీమ్‌కు ఆర్డర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఈ-మెయిళ్లు శుక్రవారం వెలుగు చూశాయి. ప్రాథమికంగా ఏడున్నర కోట్ల రూపాయలు చెల్లించి ఆ టెక్నాలజీని అమ్మేందుకు కన్సల్టెన్సీ జరిపిన సంప్రదింపుల కేబుళ్లను వికీలీక్స్ బయటపెట్టింది. బయటపడ్డ కేబుళ్లలోని సమాచారం ప్రకారం జూన్ 12న ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ ప్రభాకర్ సింగపూర్‌లోని హాకింగ్ టీమ్ సింగపూర్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ చీఫ్ డేనియల్ మగ్లిట్టాతో ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. 


line


ఏపీ పోలీసులకు అత్యవసరంగా సెల్యులార్ ఇంటర్‌సెప్షన్ హార్డ్‌వేర్ కావాలని ఆర్డర్ చేశారు. ఏ అవసరాలకోసం దాన్ని వినియోగించదలిచింది వివరాలను ఆయన ఈ మెయిల్‌కు జత చేశారు. టెక్నాలజీకి సంబంధించి అనేక సందేహాలతో కూడిన ప్రశ్నావళిని హాకింగ్ టీమ్‌కు పంపించారు. అంచనాగా ఒక ధర ఎంతో చెబితే తాను తన క్లయింట్ (ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్)కు చెప్పి ఆ మొత్తం సమకూర్చేందుకు యత్నిస్తానని ప్రభాకర్‌రెడ్డి ఆ మెయిల్‌లో స్పష్టం చేశారు. హాకింగ్ టీమ్‌కు సంబంధించిన ఇతర టెక్నాలజీ కొనుగోలుకు సైతం యత్నిస్తానని హామీ ఇచ్చారు. 


సుమారు 20నుంచి 50 మ్బైల్ లైసెన్స్‌లు అర్జంటుగా కావాలని అందులో కోరారు. దీనిపై స్పందించిన హాకింగ్‌టీమ్ ప్రతినిధి మగ్లిట్టా, ప్రభాకర్‌రెడ్డి పంపిన ప్రతిపాదనను పరిశీలించినట్టు ధృవీకరిస్తూ ఆయన కోరిన సాప్ట్‌వేర్ కావాలంటే ఉజ్జాయింపుగా సుమారు 7.5 కోట్ల రూపాయలు అవుతుందని, అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని స్పష్టం చేశారు. ఒకసారి క్లయింట్ (ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్)ను కలిస్తే ఇంకా ఇతర విషయాలు మాట్లాడవచ్చని ప్రతిపాదించారు. జూన్ 16, 17 తేదీల్లో కూడా స్కైప్‌లో ఇద్దరూ సంభాషించుకున్నారు. 


ఇదీ హాకింగ్‌టీమ్ కంపెనీ కథ..


ఇటలీలోని మిలాన్ కేంద్రంగా గిజ్మోడో హాకింగ్‌టీమ్ సంస్థ పనిచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు, ఇంటెలిజన్స్ సంస్థలకు ఫోన్లను ట్యాప్ చేసే సాప్ట్‌వేర్‌ను చట్టబద్ధమైన పద్ధతుల్లో అమ్ముతున్నామని బాహాటంగా చెప్తున్నా ఈ సంస్థ బ్లాక్‌బెర్రీ, ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లలో నిఘాపెట్టే సాప్ట్‌వేర్‌ను లోడ్‌చేసే పరికరాలు అమ్ముతారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే రష్యా, సౌదీ అరేబియా తదితర దేశాలకు ఇలాంటి సాప్ట్‌వేర్ అమ్మింది. ఆసియాలో ఈ సంస్థకు సింగపూర్‌లో రిప్రజెంటేటివ్ కార్యాలయం ఉంది. దానికి చీఫ్‌గా మగ్లిట్టా పనిచేస్తున్నారు. భారత్‌లో ఈ సంస్థ ప్రతినిధులు పర్యటనలు కూడా జరిపారు. 


ఎక్కడిదీ ఓర్టస్..?


ఇది ఐటీ కన్సల్టెన్సీ సంస్థ. దీని రిజిస్టర్ ఆఫీస్ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 7 లోని బీ6 ఇంటినెంబర్‌తో ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయిన ఈ సంస్థ డైరెక్టర్లుగా కాసు ప్రభాకర్‌రెడ్డి, జోత్స్నరెడ్డి, కుంజిబెట్టు విష్ణుదాస్ ప్రభు ఉన్నారు. ఇటలీకి చెందిన ఒక సంస్థ ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, ఈమెయిళ్లపై నిఘా పెట్టే సాప్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాప్ట్‌వేర్‌ను వివిధ ఏజెన్సీలకు అమ్మింది. ఆ సాప్ట్‌వేర్‌ను హాకింగ్‌టీమ్ అనే సంస్థ అమ్మకందారుగా సింగపూర్ నుంచి పనిచేస్తున్నది. ఓర్టస్ సంస్థ ఆ అమ్మకందారును ఏపీ పోలీసుల కోసం సంప్రదించింది. 


మొగున్ని కొట్టి...


ఓటుకు నోటు కేసు బయటపడగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ గగ్గోలు పెట్టారు. గల్లీనుంచి ఢిల్లీదాకా ఫిర్యాదులు చేశారు. ఏపీ మంత్రులు అదే తారకమంత్రం అన్నట్టు నానా యాగీ చేశారు. చంద్రజ్యోతి వంటి పత్రికలు ట్యాపింగ్ ఎంత నేరమో ఎన్ని ప్రభుత్వాలు ఆ కారణంగా కూలిపోయాయో కథలు చెప్పాయి. ఇంతా చేసి ట్యాపింగ్ జరిగిందంటూ ధ్రువీకరించే ఏ చిన్న ఆధారమూ చూపలేక సెల్‌ఫోన్ ప్రొవైడర్లకు నోటీసులిచ్చి భయానక పరిస్థితిని సృష్టించారు. ఇంతాచేసి బాబు చేసిందేమిటి? సరిగ్గా తెలంగాణ మీద ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న సమయంలోనే ట్యాపింగ్ టెక్నాలజీ కోసం రూ.7.5 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడ్డారు. 


ఈ విషయం వికీలీక్స్ బయటపెట్టడంతో తేలుకుట్టిన దొంగలా ఆయన పరిస్థితి మారిపోయింది. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు చంద్రబాబు యత్నించడం మీద తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. తెలంగాణ మీద ప్రయోగించేందుకే ఆయన సదరు టెక్నాలజీ కోసం వెంపర్లాడుతున్నారని వారు ఆరోపించారు. మొగున్ని కొట్టి మొగసాలకెక్కినట్టు తాను ఓ వైపు ట్యాపింగ్‌కోసం యత్నిస్తూ ఎదుటివారిమీద నిందలు వేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. 


ట్యాపింగ్ అనేది ఘోరమైన నేరమే అయితే చంద్రబాబుకు ఏ శిక్షపడుతుందో సీమాంధ్ర మీడియా ఇపుడు వివరించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసుతో పాటు ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలులో కూడా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వికీలీక్స్ సమాచారానికి తిరుగులేదని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సత్వరమే ఈ కొనుగోళ్ల బేరసారాల మీద విచారణ జరిపించాలని, సదరు టెక్నాలజీ ఏపీ ప్రభుత్వానికి చేరిందా అనే విషయం తేల్చాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



శుక్రవారం, జులై 10, 2015

ఇదంతా మా ఔదార్యమే.. మీ హక్కు కాదు..!!

పాపమని పచ్చి పులుసు వోత్తె నేతిబొట్టు లేదని లేసిలేసి ఉరికిందట అనే  సామెత తెలంగాణలో ఉన్నది. అరవై ఏళ్లుగా ఆంధ్రులు (ఆంధ్రపాలకులు, ఆంధ్ర అక్రమార్కులు) ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఈ సామెతలో ఎంత వాస్తవముందో అర్థమవుతుంది. తెలంగాణ రాష్ర్టం ఏర్ప డిన తర్వాత కూడా మొగన్ని గొట్టి మొరమొర అన్నట్టే ఉంది వాళ్ల వైఖరి. అంటే భర్త భార్యను కొట్టొచ్చు కానీ, భార్య భర్తను కొట్టొద్దని అర్థం కాదు. ఎవరూ ఎవర్నీ కొట్టకూడదని. ఆడ అయినా మగ అయినా తానే ఇతరులను కొట్టి, తననే కొట్టారని ఒర్రడం లాంటిదే. ఇటీవల ఆంధ్రులు తెలంగాణ పట్ల చేస్తున్నదదే. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్ర రాజకీయులు ఇటేటు రమ్మంటే ఇళ్లంతా నాదే అన్నట్టుంది. 


గత అరవై ఏళ్లుగా తెలంగాణపై ఆంధ్ర రాజకీయులు, పెట్టుబడిదారులు సాగిస్తున్న దోపిడీని, ఆధిపత్యాన్ని సజీవంగా ఉంచడానికి చేస్తున్న ప్రయత్నమే హైదరాబాద్‌ను గవర్నర్ పాలన కింద ఉంచమనడం. సుమారు ఐదువందల ఏళ్లుగా హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి రాజధాని. హైదరాబాద్‌లోని ప్రతి భవన నిర్మాణంలో, నగర నిర్మాణంలో తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో పాటు, చెమట ధారలున్నాయి. ఆంధ్రవాళ్ళు స్వాతంత్య్ర పూర్వం నాటికే భారతదేశంలో ఐదవ మహా నగరంగా ఉన్న భాగ్యనగరంపై కన్నేశారు. హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రతో బలవంతంగా విలీనం చేశారు. నాటినుంచి వలస పాలకులు తెలంగాణను అరవై ఏళ్ల పాటు అన్నిరంగాల్లో ధ్వంసం చేశారు. ఇది చాలదన్నట్లుగా ఉమ్మడి రాజధాని పేరుతో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ దోపిడీ కొనసాగించాలని ఆరాటపడుతున్నారు. దానికి నాయకత్వం వహించేది ఏపీ సీఎం చంద్రబాబు.


సెక్షన్ 8 పేరుతో హైదరాబాద్ నగర శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్‌కు అప్పగించాలని నానా యాగీ చేయడం తెలంగాణ రాష్ర్ట సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే. విభజన చట్టంలో సెక్షన్-8 ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అందులో ఏముందనే విషయాన్ని పరిశీలిస్తే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అదుపుచేసే స్థితిలో లేనప్పుడు ఆ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించాల్సి ఉంటుంది. గత సంవత్సరకాలంగా ఎవరి శాంతిభద్రతలకు భంగం ఏర్పడింది? ఏ ఒక్క సంఘటన జరిగిందా? ఇక్కడ ఆంధ్ర ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అలాంటప్పుడు సెక్షన్-8 అవసరం ఎక్కడున్నది? ఆంధ్రులకు గాని, ఇతరులకు గాని ఎలాంటి నష్టం జరగకపోగా 10వ షెడ్యూల్ కింద ఉన్న సంస్థల్లో ఇప్పటికి ఆంధ్ర పెత్తనమే సాగుతుంది. 


విభజన సూత్రాలను ఉల్లంఘించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయటానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా తెలంగాణ ప్రజలు, నాయకులు ఓపికతో వేచిచూస్తున్నారు. ఆంధ్ర, రాయలసీమ, జిల్లాల్లో తెలంగాణ ప్రజలు స్వల్ప సంఖ్యలో ఉన్నా వాళ్లది అక్కడ ఉండలేని పరిస్థితి. హైదరాబాద్‌లో, ఇతర తెలంగాణ జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న కోస్తాంధ్ర ఉద్యోగులు పెత్తనం కొనసాగిస్తుంటే వాళ్ల శాంతిభద్రతలకు ఏం భంగం కలిగినట్లు? ఓటుకు నోటు వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు సెక్షన్-8ని తెరపైకి తెస్తున్నారనడంలో అనుమానం లేదు. అయినంత మాత్రాన చేసిన తప్పు తప్పు కాకుండా పోతుందా? పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినంతమాత్రాన ఏం నేరం చేసినా, ఎంతపెద్ద తప్పు చేసినా చూస్తూ కూర్చోవాలా? ఉమ్మడి తాత్కాలిక రాజధానిలో ఉండనిచ్చేది నేరాలు చేయడానికా? హుందాగా విచారణకు అంగీకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలె కానీ దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తే అది ఏ పాటి రాజనీతి అవుతుంది? కుటిల నీతి తప్ప.


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేంతవరకు హైదరాబాద్‌ను ముఖ్యపట్టణంగా వాడుకోవచ్చుని తెలంగాణ ప్రజలు, నాయకులు అంగీకరించడం తప్పా? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్‌పై ఏ హక్కులు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నట్లు కాదు. ఆంధ్రలో అన్ని వసతులున్న మహా నగరం లేదు కాబట్టి హైదరాబాద్‌లోని భవనాలను ఉపయోగించుకొని పాలన చేసుకోవాలని అంగీకరించినట్టు. ఇది తెలంగాణ ప్రజల, నాయకుల మంచితనానికి నిదర్శనం. ఇందుకు ఫలితంగా హైదరాబాద్‌పై మాకు హక్కు ఉందనడం ఇటేటు రమ్మంటే ఇల్లంతా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లే కదా? ఈ పాపానికి మేం ఏం చేసినా చెల్లుతుందని సీమాంధ్ర నాయకులు భావిస్తే అది చట్ట ధిక్కారమే అవుతుంది. ఎన్ని కుట్రలు చేసినా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించినా మా మీద ఏ చర్యలూ తీసుకోవద్దని ఎదురుదాడి పేరుమీద రాజకీయాలు చేయడం మానుకొని, తప్పును ఒప్పుకొని లేదా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడమో చేయాలి. అంతేకానీ ఎదురుదాడి పేరుతో దారి, దృష్టి మళ్ళింపు రాజకీయాలు చేయడం సరైంది కాదు. నాలుగు వందల ఏళ్ల పైకాలం నుంచి, ఇప్పటికీ, ఎప్పటికీ హైదరాబాద్ తెలంగాణ ప్రజలదే. దీనిపై హక్కులన్నీ తెలంగాణ ప్రభుత్వానివే. ఓటుకు కోట్లు లాంటి అనైతిక చర్యలు శాంతిభద్రతలు ఎవరి చేతిలో ఉన్నా నేరపూరితమైనవే. నేరస్థులు శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పటికైనా హైదరాబాద్‌పై పెత్తనం చేయాలనే దురాశను వదులుకొని సీమాంధ్ర రాజకీయాలను తమ పదమూడు జిల్లాలకు పరిమితం చేసుకుంటే హైదరాబాద్‌లో ఉన్న తెలుగువాళ్లు అన్నదమ్ముల్లా కలిసే ఉంటారు.


అవును.. హైదరాబాద్ తెలంగాణ ప్రజల జాగీరే. కులీ కుతుబ్ షా, భాగమతిల ప్రేమకు చిహ్నంగా తెలంగాణ ప్రజల చెమటధారలతో నిర్మింపబడిన నాలుగు వందల ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉన్న చారిత్రక నగరం. మీకు రాజధాని లేదు కాబట్టి తాతాలికంగా ఇక్కడుండి పాలించుకొండి అన్నంత మాత్రాన మరో పదేళ్లు దోచుకోమని కాదు. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేసుకొని వెళ్ళమని. ఇంత కాలంగా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించి పాలించిన ఆంధ్రులు తామేం చేసినా ఊరుకోవాలని, లేకుంటే తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారనడం హాస్యాస్పదం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినంతమాత్రాన నేరం చేస్తే చర్యలు తీసుకొనే హక్కు, అధికారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదా? అరవై ఏళ్లు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని హరించిన సీమాంధ్ర నాయకులు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం నవ్వులాటగానే ఉన్నది. రాజధాని తయారయ్యేవరకు తగాదాలతో ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అమరావతి దేవేంద్ర నగరం సకల సౌభాగ్యాలను, సౌకర్యాలనిచ్చే వైభవోపేత నగరం నిర్మాణం కావాలంటే దేవతల కాలమానం ప్రకారం మనుషులకు వందల సంవత్సరాలు పడుతుంది. 


ఎందుకంటే మనుషులకు పదేళ్ల కాలం దేవతలకు లిప్తకాలం కూడా కాదు. గిల్లికజ్జాలతో లిప్తకాలం కూడా వేచి చూస్తూ లడాయితో కాలయాపన చేసే ఓపిక తీరిక, తెలంగాణ వాళ్ళకు లేదు. ఎందుకంటే అరవై ఏళ్ల పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే పనిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అనవసర తగాదాలు పెట్టుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.


సెక్షన్-10 షెడ్యూల్‌ను అడ్డుపెట్టుకొని సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లోనే పర్మినెంటుగా స్థిరపడటానికి కుట్రలు చేయడం సరైంది కాదు. దీంతో తెలంగాణ ఉద్యోగావకాశాలు దెబ్బతిని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఫలితం భంగమవుతుంది. అలాగే సెక్షన్-8 పేరుతో నేరాలు చేసి తప్పించుకోవాలని చూడటం కుట్రలో భాగమే. అందుకోసం సీమాంధ్ర నాయకులు తెలంగాణపై కుట్రలు మానుకొని తెలంగాణ జాగీరైన హైదరాబాద్ గురించి కాక తమ దేవేంద్రనగరం అయిన అమరావతి నిర్మాణం గురించి పూర్తి సమయాన్ని కేటాయిస్తే సీమాంధ్ర ప్రజలకు మేలు జరుగుతుంది. తెలంగాణ నాయకుల్లా విభజన చట్టాన్ని గౌరవించి చట్టం తన పనిని తాను చేసుకునేందుకు సహకరించడం తప్ప సీమాంధ్ర నాయకులకు మరో మార్గం లేదు. అలా చేయకుంటే చట్టం ఎలాగూ తనపని తాను చేసుకుంటూ పోతుంది. కానీ సీమాంధ్ర నాయకులను చరిత్ర క్షమించదు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేంతవరకు హైదరాబాద్‌ను ముఖ్య పట్టణంగా వాడుకోవచ్చుని తెలంగాణ ప్రజలు, నాయకులు అంగీకరించడం తప్పా? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్‌పై ఏ హక్కులు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నట్లు కాదు. ఆంధ్రలో అన్ని వసతులున్న మహానగరం లేదు కాబట్టి హైదరాబాద్‌లోని భవనాలను ఉపయోగించుకొని పాలన చేసుకోవాలని అంగీకరించినట్టు. ఇది తెలంగాణ ప్రజల, నాయకుల మంచితనానికి నిదర్శనం.


వ్యాసరచయిత: కాలువ మల్లయ్య



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


గురువారం, జులై 09, 2015

అవి కల్తీలేని కన్నీళ్లా?!

-ప్రాజెక్టుల మీద పెడబొబ్బలు
-సొంత తీర్పులతో వింత రాతలు
-మార్పుతో కలిసి రాని మేధావులు
రాష్ట్రంలో ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ జరుగుతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతిపాదించిన.. చేపట్టిన ప్రాజెక్టుల మంచి చెడ్డలకు అనుగుణంగా మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాదినుంచి ఇందుకోసం భారీ కసరత్తు జరుగుతున్నది. ఇందులో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుగా మారిపోయింది. పాలమూరు-రంగారెడ్డి పథకం నీరు స్వీకరించే చోటు కూడా మారింది. అదే దారితో నక్కలగండి ప్రాజెక్టు తీరు తెన్నుల్లో మార్పులు వచ్చాయి. కొన్ని ప్రాజెక్టులకు మెరుగైన ప్రత్యామ్నాయాలు లభ్యమైనపుడు పాతవి పక్కన పెట్టడం సాధారణం. ఈ క్రమంలో లేని అపోహలను ఉద్రిక్తతలను రేకెత్తించే కార్యక్రమం ఒకటి ప్రారంభమైంది. ప్రాణహిత ప్రాజెక్టు మార్పు అంటూ మేధావుల వేదిక పేరిట దాడి మొదలైంది. లేనిపోని ఉద్దేశాలు అంటగడుతూ బట్టకాల్చి మీద వేసే రీతిలో ఇది కొనసాగుతున్నది. ప్రాణహిత ప్రాజెక్టు మార్పు ఆదిలాబాద్ జిల్లాకు నష్టమంటూ సామాన్య ప్రజలకు అంతగా తెలియని సముద్ర మట్టాలు, నీటి లభ్యత, ముంపు తదితర లెక్కలు ముందు పెట్టి ప్రచారం చేస్తున్నారు. 

sagar




వాస్తవానికి తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ప్రభుత్వం ఆపివేయలేదు. అది అమలులోనే ఉంది. తుమ్మిడిహట్టి వద్ద ఎత్తిపోతలతో లక్షా 50 వేల ఎకరాలకు నీరివ్వాలని ప్రతిపాదిస్తున్నది. దానికి ఇప్పటిదాకా కట్టిన కాల్వలను వాడుకోవాలని ప్రతిపాదించింది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదనలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు తోడు నూతన పథకాలకు రూపకల్పన జరుగుతున్నది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పెన్‌గంగ ప్రాజెక్టుకు మహారాష్ట్ర అనుమతిని సాధించింది. చుక్క నీరు జిల్లాకు దక్కదని రాతలు రాస్తున్న వారు దీన్ని విస్మరిస్తున్నారు.


మార్పు చేర్పులు ఇపుడే కొత్తా?ప్రాజెక్టుల డిజైన్లు, స్థలాలు, దిశలు మారడం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. గతంలో శ్రీశైలం ఎడమ కాలువ విషయంలోనే సొరంగమా? లిఫ్టా? అనే విషయంలో అనేక వాదోపవాదాలు జరిగి ఆచరణయోగ్యం అని భావించిన తర్వాతే సొరంగ మార్గాన్ని ఎన్నుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకం మొదట్లో జూరాల బ్యాక్‌వాటర్‌ నుంచి తీసుకోవాలని ఆ జిల్లాకు చెందిన మాజీ ఇంజనీర్లే ప్రతిపాదించారు. ఈ మేరకే సర్వేలు సిద్ధమయ్యాయి. ఆ తర్వాత ముంపు గ్రామాల సమస్య వచ్చింది. జూరాలనుంచి నీరు తోడడం అనేది ఇతర అపోహలకు దారితీసే అవకాశం వచ్చింది. దీనితో వ్యయం ఎక్కువైనా నేరుగా శ్రీశైలం రిజర్వాయర్‌నుంచే నీరు తీసుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల నీటికి గ్యారెంటీకూడా పెరిగింది. ఇదే రీతిలో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీరందించే నక్కలగండి పథకం. తొలుత నీరు తీసుకోవడానికి ప్రతిపాదించింది వేరు. ఇపుడు శంకుస్థాపన చేసిన సమయానికి నిర్ణయించింది వేరు. ఇవాళ కాళేశ్వరం వద్ద పథకం ఏదో తప్పు అంటున్న వాళ్లు నిజాం కాలంలో నిర్ణయించిన ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు కాస్తా అటు ఇటూగా ఇక్కడికి సమీపంలోనే ప్రతిపాదించారని మరిచిపోతున్నారు. మేధావులైనా.. రాజకీయవాదులైనా గమనించాల్సిన అంశం ఏమిటంటే టీఆర్‌ఎస్‌లో జలవనరుల నిపుణులు పెద్దసంఖ్యలో ఉన్నారు. కేంద్రజలవనరుల సంఘం స్థాయిలో పనిచేసినవాళ్లూ ఉన్నారు. ఇవాళ పాలమూరు ఎత్తిపోతల నుంచి కాళేశ్వరం దాకా అన్ని పథకాల్లో వారి శ్రమ, చెమట ఉన్నాయి. 


అంకెలు.. రంకెలు...సముద్ర మట్టాలు, రిజర్వాయర్ ఎత్తులు, నీటి లభ్యతలు వాదనల కోసం ఇష్టారాజ్యంగా మార్చేయడం మనకున్న పాత జబ్బు. తుమ్మిడిహట్టి వద్ద కనీసనీటి లభ్యత 160 టీఎంసీలు అని మన వాదన. కానీ జలసంఘం ఈ లెక్కలను కొట్టేసింది. ఇక్కడ 110-20 టీఎంసీలను మించి లభ్యత లేదు పొమ్మంది. అలాగే ప్రాజెక్టు డిజైన్‌లో 160 టీఎంసీలకు సరిపడా బ్యారేజీలు లేవని చెప్పింది. 14.7 టీఎంసీల నీరు సరిపోయే ఏడు బ్యారేజీలు కట్టి 160 టీఎంసీలు పరిమిత కాలంలో ఎక్కడ ఎత్తిపోస్తారు? అని నిలదీసింది. ఏది నిజం? ముంపు విషయం కూడా అంతే. ప్రాణహిత వల్ల మహారాష్ట్రలో 10 వేలకు పైగా ఎకరాలు, తెలంగాణలో 17 వందలకు పైగా ఎకరాల ముంపు ఉంది. 2015 ఫిబ్రవరి 15న మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ సమావేశం జరిపినపుడు ముంపు ఉంటే అంగీకరించలేమని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనితో ముంపును పరిమితం చేసేందుకు రిజర్వాయర్ ఎత్తు తగ్గించడం నుంచి ప్రారంభించి ఒకటికి బదులు రెండు మూడు రిజర్వాయర్ల ప్రతిపాదనలు కూడా పరిశీలించిందన్న విషయాన్ని మేధావులు వారి వేదికలు తమ సౌకర్యార్థం మరిచిపోయినట్టు కనిపిస్తున్నది. మహారాష్ట్రతో జరిగిన చర్చల్లో అనేక ఏండ్లుగా నలుగుతున్న పెన్‌గంగ ప్రాజెక్టు సుఖాంతం అయినపుడు ప్రాణహిత చేవెళ్ల సుఖాంతం ఎందుకు కాలేదు? అని క్షణం ఆలోచించినా వాస్తవం బోధపడుతుంది. 


ఇక ప్రాణహిత.. గోదావరి అంటూ విచిత్ర వాదనలు. ప్రాణహిత మీద కడితే ఏపీతో సమస్య ఉండదని సిద్ధాంతీకరణ. మరి ఏపీ ప్రభుత్వం తుంగభద్రను మరోమార్గంలో మళ్లించి ప్రాజెక్టు కట్టుకుని కృష్ణ నీటితో సంబంధం లేదంటే మనం నోట్లో వేలేసుకుని కూచుంటామా? పైన బిగబట్టి ప్రాజెక్టులు కడితే కింది రాష్ర్టాలు, జలసంఘాలు, ట్రిబ్యూనళ్లు కండ్లు మూసుకుంటాయా? 


ఆఖరుకు జిల్లావాదులుగా..విచిత్రమైన విషయం ఏమిటంటే మేధావులుగా ఉద్యమకారులుగా చెలామణీ అయ్యే అనేకమంది ఆఖరుకు జిల్లావాదులుగా బయట పడిపోతున్నారు. ఎంతోకాలంగా చాలా హుందాగా వ్యవహరిస్తారని పేరున్న ఓ ప్రొఫెసర్ ఆ మధ్య ఓ వ్యాసంలో పాలమూరుకు కావల్సినవి చేయకపోతే బాగుండదంటూ చండప్రచండంగా ఓ హెచ్చరికే జారీ చేశారు. అలాగే ఓ ఉద్యమకళాకారిణి రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ పాలమూరు రంగారెడ్డి పథకం వదిలి కేసీఆర్ జూరాల పాకాల చేపడితే విప్లవం వస్తుందని హెచ్చరిక జారీ చేశారు. చాలా విచిత్రం.. రంగారెడ్డి మీద ప్రేమ కురిపించిన సదరు ఉద్యమకారిణికి వరంగల్ జిల్లా అక్కరలేదా? అనే అనుమానం తలెత్తుతుంది. ప్రాణహిత గురించి వాదిస్తున్న ఓ ఉద్యమకారుడు కూడా తాను జిల్లా వాసినని.. జిల్లాను ప్రేమిస్తానని చెప్తున్నారు. జిల్లా మీద ప్రేమ కురిపిస్తున్న ఉద్యమకారులు అదే జిల్లాలో సదర్‌మాట్ విషయం మాత్రం మాట్లాడరు. వట్టివాగు వట్టిపోతే, కడెం చివరి ఆయకట్టు ధ్వంసమవుతుంటే మాట్లాడరు. అనేక ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న లోయర్ పెన్‌గంగ గురించి బాధపడరు. 


అది ధర్మాగ్రహం.. కుటుంబాన్ని పోషించేందుకు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసే కుటుంబ పెద్ద... తన కష్టాన్ని గుర్తించకపోగా లేనిపోని నిందలు వేస్తే.. ఆటంకాలు కలిగిస్తే ఆగ్రహం చెందడం సహజం. ఒక తపనతో పనిచేసే వారు ’కమీషన్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నారు’ లాంటి చవకబారు విమర్శలు విన్నపుడు కటువుగానే తిప్పికొడుతారు. ఓ సచివాలయం కడదామంటే అడ్డంకులు.. హుస్సేన్‌సాగర్ను శుభ్రం చేస్తామంటే అడ్డంకులు.. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామంటే ఆందోళనలు.. రైతుమాఫీ రెండు రోజులు ఆలస్యమైతే దాడులు... మైనారిటీ తీరని బీడీకార్మికులకూ పింఛన్లు కావాలనే డిమాండ్లు.. అరవై ఏండ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తొలిప్రభుత్వాన్ని అడుగడుగునా ఆటంకపరిచే చర్యలు చూసి చూసి విసిగిపోయిన ఆవేదనకు రూపం ఆ మాటలు. న్యాయం ఆలోచించే వారికి అందులో న్యాయం కనిపిస్తుంది. దోషం వెతికే వారికి దోషమే కనిపిస్తుంది. ఎక్కడ దొరుకుతాడా? అని కసిగా వెంటాడేవారికి అందులో కులతత్వం, దురహంకారం కూడా కనిపిస్తుంది. గత ఏడాదిగా ప్రాజెక్టుల అంశం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపినన్ని సమావేశాలు, సమీక్షలు బహుశా మరే రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి జరిపి ఉండక పోవచ్చు. ఇటు జలరంగ నిపుణులు, అటు అధికారులు, మధ్యలో వాప్కోస్ వంటి సంస్థల నివేదికలతో శతావధానం చేశారు. తాను స్వయంగా కృష్ణా, గోదావరి నదులను విహంగ వీక్షణం చేయడం.. నిపుణులకు కూడా పంపించడం ఆయా ప్రాజెక్టులను సందర్శించడం.. ఇలా కేసీఆర్ భారీ కసరత్తే చేశారు. పొద్దున ఢిల్లీలో జలసంఘాన్ని కలిసి మాపటికి హైదరాబాద్‌లో సమీక్షలు జరిపిన ఉదంతాలు కూడా ఉన్నాయి. పుట్టిన రోజు నాడు మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర సీఎంతో గంటలతరబడి చర్చలు జరిపారు. లోయర్ పెన్‌గంగకు ఆ సమావేశంలోనే పరిష్కారం లభించింది. ప్రాణహిత ప్రాజెక్టుకు 160 టీఎంసీల నీటి వాడకానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. అయితే ముంపు విషయంలోనే పీటముడి పడింది. ఒక రాష్ట్రం తన భూభాగం ముంపుకు ససేమిరా అన్నంత కాలం ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యపడుతుందా? అనేది మేధావులూ నాయకులతో పాటుగా తెలంగాణులందరూ ఇపుడు ఆలోచించాలి.


-సవాల్‌రెడ్డి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


బుధవారం, జులై 08, 2015

ఏసీబీవద్ద ఉన్న మరో బ్రహ్మాస్త్రం...!!!

-సండ్ర రిమాండ్ డైరీలో సంచలనాలు
-రేవంత్, సెబాస్టియన్, సండ్రతో బాబు స్కెచ్?
-పదే పదే బాబు పేరు జపించిన ఎమ్మెల్యే
-కాల్ రికార్డింగ్‌లో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే
-బయటికి వచ్చిన జనార్దన్ పేరు
ఓటుకు నోటు కేసులో ఇప్పుడు ఏసీబీ వద్ద మరొక బ్రహ్మాస్త్రం ఉన్నది!! ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలన్నీ ఈ రిమాండ్ షీట్‌లోనే ఉన్నాయి! కుట్ర మొదలైన దగ్గర నుంచి కొనుగోలుకు యత్నం జరిగిన దాకా చోటు చేసుకున్న పరిణామాలన్నీ దీనిలో ఏసీబీ పూసగుచ్చిందని తెలిసింది. దీనిని మంగళవారం ఏసీబీ కోర్టుకు సమర్పించింది. స్టీఫెన్‌సన్ కొనుగోలుకు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో జరిగిన టీడీపీ మహానాడు వేదికగానే కుట్ర జరిగిందని, చంద్రబాబు నివాసం కూడా ఈ కుట్రలో ఉందని రిమాండ్ డైరీలో ప్రస్తావించిన సంభాషణల్లో తేటతెల్లమవుతున్నది. 

babugate


సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను అరెస్ట్ చేసిన ఏసీబీ మంగళవారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెడుతూ సమర్పించిన రిమాండ్ డైరీ.. ఈ కుట్రలో ఎమ్మెల్యే సండ్ర పాత్రను కళ్లకు కట్టింది. మహానాడులోసైతం చంద్రబాబు మనసంతా కుట్ర చుట్టూనే తిరిగిందని డైరీలో ప్రస్తావించిన నేతల సంభాషణల్లో వెల్లడవుతున్నదని సమాచారం. మే 31న రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహాలను అరెస్ట్ చేసిన ఏసీబీ వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఎస్‌ఎల్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక, సెల్‌ఫోన్ల నిశిత పరీశీలనతో సెబాస్టియన్ ఫోన్‌లో మే 23 నుంచి 31 వరకు రికార్డ్ అయి ఉన్న ఆడియోలు, ఫోన్ కాల్ నంబర్లను బట్టి సీడీఆర్ (కాల్ డాటా రికార్డ్)లను తీసుకుంది. సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి కూడా సెబాస్టియన్, రేవంత్, సండ్ర కాల్స్ వివరాలు తీసుకొని పరిశీలించినట్టు ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ డైరీలో స్పష్టంచేసింది. 


ఎవరెవరితో ఎప్పుడు.. ఎన్నిసార్లు..


సండ్ర మొబైల్ నంబర్ 8790825678 నుంచి రేవంత్ ఫోన్ (9505900009)కు 24వతేదీ నుంచి 31 వరకూ 18 కాల్స్ వెళ్లాయి. సండ్ర రెండో నంబర్ 9440625955 నుంచి రేవంత్‌రెడ్డి రెండో నంబర్ (8790900009)కు 24వతేదీ నుంచి 31వరకు రెండుసార్లు కాల్స్ వెళ్లాయని కాల్ డాటాను బట్టి తేలింది. సండ్ర తన మొబైల్ నంబర్ 8790825678 నుంచి 27.5.2015 నుంచి 31.5.2015వరకు సెబాస్టియన్ ఫోన్ 9394326000కు 19సార్లు, 9440625955 నుంచి ఇదే నంబర్‌కు 12సార్లు కాల్ చేశారు. 


సండ్ర సంబంధీకుల స్టేట్‌మెంట్...


స్టీఫెన్‌సన్ వ్యవహారంలో సండ్ర మే 27నుంచి 30వరకు ఎక్కడెక్కడ తిరగారు? ఎవరెవరిని కలిశారు? అన్న కోణంలో ఏసీబీ అధికారులు ఆయన గన్‌మెన్‌తో పాటు పీఎస్‌వో, మరో వ్యక్తిని విచారించారు. వారి స్టేట్‌మెంట్లను సైతం రికార్డు చేసినట్టు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. స్టీఫెన్‌సన్‌కు ఇరవై ఏండ్లుగా పరిచయస్తుడైనా సెల్వన్‌తన్ ఆంటోనీని సెబాస్టియన్ మే 28న సంప్రదించాడు. స్టీఫెన్‌సన్‌ను తనకు పరిచయం చేయాలని ఆంటోనీని సెబాస్టియన్ కోరాడు. దీనితో సెబాస్టియన్‌ను స్టీఫెన్‌సన్ ఇంటికి తీసుకెళ్లి ఆయన్ను పరిచయం చేశాడు. అయితే సెబాస్టియన్ సండ్రకు చెప్పినట్టు ఆంటోనీ ద్వారా స్టీఫెన్‌సన్‌ను పరిచయం చేసుకొని కొనుగోలు వ్యవహారం ప్రారంభించాడని ఏసీబీ రిమాండ్ డైరీలో తెలిపింది. ఎమ్మెల్యే సండ్ర గన్‌మెన్ పీ లచ్చును సైతం ఏసీబీ అధికారులు విచారించి, స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. 29న వెంకట వీరయ్య మహానాడుకు హాజరయ్యారని, మరునాడు 30న ఉదయం 9గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి, అక్కడినుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లారని లచ్చు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. అదే రోజు మధ్యాహ్నం 2గంటలకు చంద్రబాబును ఆయన క్యాంప్ ఆఫీస్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు వెళ్లి కలిసినట్టు లచ్చు తెలిపాడు. సాయంత్రం 6గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారని, ఆ హోటల్లో టీడీపీ ముఖ్యనాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి ఉన్నారని, 31వ తేదీ సాయంత్రం 5గంటలకు చంద్రబాబు ఇంటికి సండ్ర బయలుదేరారని చెప్పాడు. అదే సమయంలో సండ్రకు ఓ ఫోన్ వచ్చిందని, రేవంత్ అరెస్ట్ విషయం తెలిసి ఏసీబీ కార్యాలయం వద్ద ధర్నాకు ఆయన వెళ్లారని లచ్చు పేర్కొన్నాడు.

సండ్ర, సెబాస్టియన్ల ఫోన్ సంభాషణల పర్వం..
మే 27 రాత్రి 9.45గంటలకు సండ్ర-సెబాస్టియన్ మధ్య ఫోన్ సంభాషణ



సెబాస్టియన్: ఎమ్మెల్యే గారా అండి.. సార్

సండ్ర: ఆ... ఏమైంది..?



సెబాస్టియన్: సార్, ఇప్పుడు మనకు ఏం ఇన్‌ఫర్మేషన్ కావాలి ఆయన(స్టీఫెన్‌సన్) గురించి?

సండ్ర:ఎమ్మెల్సీఎలక్షన్స్‌లోఆయనకు ఓటు ఉండాలి.


సెబాస్టియన్: అవును సార్.

సండ్ర: ఇంగా, ఆయనేమన్నా మనకు అమౌంట్‌కు లొంగుతాడేమో, మన పార్టీకి సహకరించమని అడగాలి.


సెబాస్టియన్: హోహో అదా.

సండ్ర: ఎందుకంటే ఆయనకు ఫర్‌దర్ రాజకీయాలు అవసరం లేదు కదా. మేమంటే ఎలక్షన్‌లో గెలవాలి. ఆయన(స్టీఫెన్‌సన్)ఒక్కసారి నామినేటెడ్ అయిపోతే అయిపోద్ది, డబ్బు ముఖ్యం కదా ఆయనకు.



సెబాస్టియన్: అది అయితే కరెక్ట్.

సండ్ర: ఆయన సోర్స్ మనకు కావాలి.



సెబాస్టియన్: మనకు ఎంత టైమ్ ఉంది సార్?

సండ్ర: మనకు ఒకటో తారీఖు పోలింగ్.



సెబాస్టియన్: ఓకే ఈ లోపు మనం ట్యాప్ చెయ్యాలి.

సండ్ర: ఈలోపు ఆయనతో మీటింగ్ ఏర్పాటుచేస్తే.



సెబాస్టియన్: ఓకే సార్, ఎట్లా.. ఎక్కడన్నా హోటల్లో టైం ఇద్దామా మాట్లాడటానికి?

సండ్ర: ఆ.. మనం ఆయనతో డీల్ చేసి సక్సెస్ కావాలి, ఫెయిల్ కావద్దు..



సెబాస్టియన్: ఓహో అదా.. నేను మాట్లాడితే గనుక, రెస్పాన్సిబులిటీ మీరు తీసుకుంటారా సార్..

సండ్ర: ఆ అమౌంట్, ఆయన ఓటుకు రెస్పాన్స్ ఇస్తే అమౌంట్‌కు రెస్పాన్సిబులిటీ నాదైతది. ఆయన ఎవరి పేరు చెపితే అదే బేరం, మధ్యవర్తి ఖాయం ఉంటది.



సెబాస్టియన్: ఆహా.. ఇప్పుడు ఆయన ఓటు మనకెయ్యాలా. మన ఎంఎల్‌సీకీ..

సండ్ర: మన అభ్యర్థికి ఆయన వెయ్యాలి.



సెబాస్టియన్: ఇన్ కేస్.. లేదు అంటే ఎస్కేప్ చేపియ్యాలే. మనం ఆరోజు ఆయనకు యే బాంబేనో, కల్‌కత్తా వెళ్లిపోయేట్లు ఏర్పాట్లు చెయ్యాలి. ఆబ్సెంట్ అయినా ఫర్వాలేదు కదా ఓటింగ్‌కు..

సండ్ర: ముందు మీరు ఓటుకు అడగండి. లేకపోతే ఆబ్సెంట్‌కు అడుగుదాం. ముందు ఓటు కావాలి.



సెబాస్టియన్: ఓకే ఓటే కావాలి.

సండ్ర: ఊం..ఊం



సెబాస్టియన్: సరే సరే నాకిప్పుడు రెండు రోజులు మహానాడు బిజీ కదా సార్, అయినా కూడా నేను..

సండ్ర: మహానాడు ఉన్నది.. నేను సెపరేట్‌గా పర్మిషన్ తీసుకుంటాను.



సెబాస్టియన్: హా సరే..

సండ్ర: నాకు రేపటికి పని కావాలి.



సెబాస్టియన్: సరే రేపుమార్నింగ్ ఎన్‌టీఆర్ ఘాట్‌లో ప్రేయర్ చేయడానికి సార్ రమ్మన్నారు.

సండ్ర: సార్ ఎన్నింటికి ఘాట్‌కు వస్తున్నారు?



సెబాస్టియన్: ఏమో సార్ అయితే నన్ను ఏడు గంటలకే రమన్నారు.

సండ్ర: ఓకే మీరు మీ పనిచేసుకోండి. మిగతా పని తర్వాత చూద్దాం.



సెబాస్టియన్: ఓకే సర్. మంచిది. నేను టచ్ ఉంటా మీకు. ఓకే.


మరుసటి రోజు(మే 28న సాయంత్రం 6.10గంలకు) సండ్రకు సెబాస్టియన్ ఫోన్ కాల్..రికార్డు...




సెబాస్టియన్: ఎంఎల్‌ఏ గారు, నమస్కారం సార్.

సండ్ర: నమస్కారం.. మీ మెసేజ్ చూశాను. ఎక్కడున్నారు?



సెబాస్టియన్: మోతీనగర్‌లోని మా ఆఫీస్‌లో ఉన్నాను. పొద్దుగాల సమాధి దగ్గరికి పోయినా, ఈ రోజు అందరి మతాల పెద్దలు వచ్చి ప్రార్థన చేశాం. అందులో మాది కూడా ఉండే.. సారు వచ్చారు.. మాకు అక్కడే పది అయి పోయింది.

సండ్ర: ఓకే ఓకే..



సెబాస్టియన్: సార్ వెంటనే సమాధిని చూసేసి, ఫ్లవర్ చల్లి వెళ్లిపోయారు. మేమక్కడే ఉన్నాం. అక్కడి నుంచి మీరు చెప్పిన పని.. నేను ఇక్కడికి పోయిన.

సండ్ర: అదే మనకు ముఖ్యంలేండి..



సెబాస్టియన్: మీరు చెప్పారు కదా.. అందుకొరకు నేను పోయాను. మాట్లాడినా.

సండ్ర: ఆ.. ఆ..



సెబాస్టియన్: ఆయనకు.. మనకు చెప్పకుండా అల్‌రెడీ ఎవరో ఈ రోజు ఉదయం పోయిడ్రంటా.

సండ్ర: ఆ.. ఆ..



సెబాస్టియన్: వాళ్ల వెర్షన్‌కు నా వెర్షన్‌కు డిఫరెన్స్ ఉంది.

సండ్ర: ఆహా..ఆహా..



సెబాస్టియన్: ఆయన (స్టీఫెన్‌సన్‌ను ప్రస్తావిస్తూ) ఏమన్నాడంటే నువ్వు మాకు బిషప్, నువ్వు చెప్పేది మాకు నమ్మకం ఉంటది. వాళ్లు (ముందువచ్చినవాళ్లు) చెప్పేది ఏమో.. నిజమా కాదా.. మళ్లీ నాకు చెడ్డపేరు వస్తదేమో అని ఒక మాట అన్నాడు.

సండ్ర: ఊ..ఊ..



సెబాస్టియన్: ఆయన్ను ఎట్లయినా మేనేజ్‌చేస్తా సార్. ఇన్‌కేస్, బీజేపీలో అట్కిసన్ అనే ఓ రాజ్యసభ మెంబర్ ఉండే. నామినేటెడ్ అంగ్లో. ఆయన్ను మా బిషప్‌లకు చెప్పి ప్రమోట్ చేసిన.

సండ్ర: ఓకే



సెబాస్టియన్: మాకు, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది.. మీకు కావాలంటే ఎక్కడపోయినా కూడా ఢిల్లీ వరకు రికమండ్ చేయగలుగుతాం.. మొదటి హమీగా మైనారిటీ కమిషన్‌లో బోర్డు మెంబర్‌గా, రెండోది ఆంధ్రాలో ఇంకా అంగ్లో ఇండియన్‌కు సీటు ఇవ్వలేదు. మీలో ఎవరైనా, మీ బంధువులుంటే రికమండ్ చేయి, బాబుతో మాట్లాడుతా..

సండ్ర: ఓకే.



సెబాస్టియన్: మూడోది, మొత్తం మన ప్రభుత్వం ఆంధ్రాలో నీకే పని కావాలన్నా చేసి పెడుతుంది.

సండ్ర: అవును..



సెబాస్టియన్: నాల్గోది, వచ్చే ఎన్నికల్లో 100శాతం టీడీపీనే వస్తది ఈడ, వస్తే మళ్లీ మీ పేరే ప్రపోజ్ చేస్తాం.

సండ్ర: అవును



సెబాస్టియన్: ఈ నాలుగు ఆప్షన్స్ ఇచ్చిన సార్. ఇచ్చేవరకు మస్త్ ప్లీజింగ్ అయిపోయిండు ఆయన. మీరు చెప్పింది చాలా బాగుంది నాకు నచ్చింది, పొద్దుగాల వచ్చిన వాళ్లు వేరే విధంగా మాట్లాడినారు అని అన్నారు.

సెబాస్టియన్: నేను ఏం చేస్తానో, అది అవుతది, నీ ఇష్టం మరీ అని అన్నాను. నాకు మీరు టైమివ్వండి అన్నాను. ఆయన ఈ రోజు నేను మా ఫ్యామిలీలో మాట్లాడతా, మా వెల్ విషర్స్‌తో కూడా మాట్లాడి, డిస్కస్ చేసుకొని ఈ రోజు గానీ లేదా రేపు పొద్దుగాల కల్లా చెప్తా అని అన్నాడు సార్.

సండ్ర: ఓకే ఓకే. వెరీ గుడ్.


సెబాస్టియన్: నో అని అయితే అనలేదు. నేను చెప్పినా నీ లైఫ్ బాగు అయిపోతది.. మేమెప్పుడు నీకు అండగా ఉంటాం. మా పార్టీ తరఫున వచ్చిన నేను. నేను, నువ్వు బిషప్‌గా లేకపోతే ఓటు ఇక పక్కకు పెట్టేసెయ్యండి. ఒక్క వెల్‌విషర్.. నువ్వు క్రిస్టియన్, నేను క్రిస్టియన్. నీకు ఏం కావాలంటే కూడా డైరెక్ట్ బాబు దగ్గరకు తీసుకువెళ్లే సత్తా నాకుంది. నీకు ఏం కావాలో చెప్పు.
సండ్ర: అందుకనే మీరు రేపటికల్లా ఓ లైన్‌అప్ చేస్తే రేపు సిట్టింగ్ పెట్టుకుందాం...


28 మే 6.15గం.లకు, ఔట్‌గోయింగ్ కాల్ 9440625955 (సండ్ర- సెబాస్టియన్)




సెబాస్టియన్: సార్, రాత్రికి ఏమన్నా కలుసుకోవచ్చా? మనం సిటీలో ఎక్కడైనా!

సండ్ర: ఓకే, ఎన్నింటికి రావాలో చెప్పు.. వచ్చేస్తా..



సెబాస్టియన్: అచ్చా.. మీరు ఎక్కడున్నారు సార్..

సండ్ర: మహానాడు దగ్గరే ఉన్నా.



సెబాస్టియన్: మహానాడు అయిపోయాకా, మనకు ఎనిమిది అయితది కదా. ఎట్లయినా 7, 8 అయితది.

సండ్ర: అవునవును. మనం ఎక్కడ కూర్చోవచ్చు?



సెబాస్టియన్: మీరు చెప్పండి సార్. ఎక్కడైనా ఫర్వాలేదు. ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకొని మనం ఎట్లా చేద్దాం ఎంటిది మరి.. ఎందుకంటే మీరు సడెన్‌గా రేపు కాల్ చేస్తే, మనం మళ్లీ మహానాడులో ఉంటాం.. ఎక్కడైనా అదే పరిస్థితి.

సండ్ర: అహా.. అహా.. మనం వున్నగానీ అంతే! అదే ప్రయారిటీ. సార్ మనకు అది ప్రయార్టీ అని చెప్పిండు. మనం మన పద్ధతిలో వెళ్దాం.



సెబాస్టియన్: అచ్ఛా.. ఓకే! మీకు ఎన్ని గంటలకు మహానాడు అయిపోతది చెబితే..

సండ్ర: అది అయిపోయినంక సార్ దగ్గర ఎమ్మెల్యేల మీటింగ్ అంటున్నారు..



సెబాస్టియన్: అహా... అహా..

సండ్ర: నేను కాగానే చెబుతా..



సెబాస్టియన్: ఓకే... ఇప్పుడు మీరు సార్ తో..

సండ్ర: మీరు ఏ ఏరియాలో ఉంటారు..



సెబాస్టియన్: మోతీనగర్ సార్..

సండ్ర: ఆయన(స్టీఫెన్‌సన్‌ను ఉద్దేశించి)..



సెబాస్టియన్: ఆయనొచ్చి సికింద్రాబాద్‌లో ఉంటాడు..

సండ్ర: మనకు, ఆయనకు, మీకు కామన్ ప్లేస్ ఎక్కడ?



సెబాస్టియన్: అట్లంటారా..

సండ్ర: ఆయన ఓకే అంటే రేపు ఏ టైం అయినా, మహానాడు అయినా ఎగ్గొట్టి వచ్చేస్తా. మీరు ముందు ఆయనతో ఓకే చేస్తే.. ఆయన డౌట్స్‌గానీ.. ఆయనకు క్లారిఫికేషన్స్ గావాల్నో, అన్నింటికీ నేను హామీగా ఉంటా.



సెబాస్టియన్: ఓకే.. ప్రాబ్లమ్ ఏందంటే.. మీరు లైన్‌లో దొరుకుత లేరు.. పొద్దుగాలనుంచి ఎన్నోసార్లు ట్రై చేసిన..

సండ్ర: మహానాడులో రావట్లేదు..



సెబాస్టియన్: అవును.. అక్కడ జాంబర్ (జామర్) ఉంటది.. నాకు తెలుసు..

సండ్ర: మీరు ఒక పనిచేయండి.. మా డ్రైవర్ నంబర్ ఇస్తాను.. అది రాసుకోండి.. 8186825560



సెబాస్టియన్: ఏం పేరు సార్ అయనది

సండ్ర: బాషా



సెబాస్టియన్: ఓకే. టైమ్ ఎప్పుడు.. నేనడిగింది ఎందంటే... రేపు మరి నేను మహానాడులో ఉండాల్న. మళ్లీ సార్‌కు తెలువదు కదా..! సార్ లేడని.. నన్ననొద్దు నీవు రాలేదని..! మళ్లీ బావుండది కదా.. ఎట్లమరి నీవు సార్‌కు..

సండ్ర: ఆల్రెడీ ఈ బాధ్యతఅప్పజెప్తున్నట్లు చెప్పి..



సెబాస్టియన్.. హా.. హా.. హా..

సండ్ర: అక్కడ జామరొస్తే.. సార్‌తోటి మీకు ఫోన్ చేపిస్తా..



సెబాస్టియన్: ప్లీజ్ ఆ పనిచేయించండి. ఎందుకంటే జనార్దన్ సార్ కూడా ఇవ్వల అడిగిండు.. నీవెందుకు రాలేదని! నాకు ఇవాల మధ్యాహ్నం ఫోన్ చేసిండు..

సండ్ర: లే.. లే.. నేను చెబుతా.. నేను చెబుతా..



సెబాస్టియన్: నేను ఆయనకు చెప్పలేదు.

సండ్ర: మీరెవరికీ చెప్పొద్దు. నేను సారుతోటి చెబుతా..



సెబాస్టియన్: ఇట్ల క్రిస్టియన్స్ ప్రెసిడెంట్ బిషప్ గారు ఈ పనిచేస్తున్నరు.. అందుకే రాలేదని చెప్పండి..

సండ్ర: లే.. లే.. నా బాధ్యత.. నేను ఒప్పజప్త..



సెబాస్టియన్: మీటింగ్‌కు ఎందుకు రాలేదంటే, మళ్లీ నాకు బాగుండదు..

సండ్ర: మీరు నాకు వదిలేసేయండి.. ఇప్పుడు నేను జనార్దన్‌గారికి కూడా చెబుతా..



సెబాస్టియన్: ఆ.. చెప్పడి. జనార్దన్‌గారికి చెప్పండి..

సండ్ర: అందరికి చెప్త



సెబాస్టియన్: అందరికీ చెప్పండి.. జనార్దన్ గారికి ఈ విషయం చెప్తున్నారా ఏమైనా?

సండ్ర: ఏమవసరం లేదు.. మనం మ పనిలో ఉన్నట్లు నేను చెప్తలే.. నీకెందుకు..



సెబాస్టియన్: అంతే చెప్పండి.. సార్ ఒక పని అప్ప చెప్పిండు.. ఆ పనిమీద ఉన్నాడని చెప్పండి...


ప్లీజ్ కాల్ మీ రిగార్డింగ్.. ద ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే..సెబాస్టియన్‌నుంచి సండ్ర సెల్‌ఫోన్లకు వచ్చిన మెసేజ్‌ల వివరాలు



సమయం: 27వ తేదీ రాత్రి 9.45 నిమిషాలు: ఎమ్మెల్యే గారు దిసీజ్ బిషప్ సెబాస్టియన్. టీడీపీ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్. ప్లీజ్ కాల్ మీ రిగార్డింగ్.. ద ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే..
సమయం: 28వ తేదీ రాత్రి 9 గంటలకు: ఎమ్మెల్యే గారు, లాబీయింగ్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే వర్క్ ఈజ్ 50% ఓకే.. కాల్ మీ బ్యాక్.. వెన్ యూ ఆర్ ఫ్రీ.
సమయం: 30వ తేదీ రాత్రి 9.30 గంటలకు: 9000976929 న్యూ నంబర్, బిషప్ సెబాస్టియన్


30వ తేదీ అవుట్ గోయింగ్ కాల్.. ఉదయం 10.35 గంటలకు (08790825678)



సండ్ర: హాలో..



సెబాస్టియన్: రేవంత్‌రెడ్డిగారికి ఫోన్ చేశాను సార్.. బాబు గారింటి దగ్గర ఉన్నాడటా..

సండ్ర: ఆహా.. ఆహా..



సెబాస్టియన్: అది మీరు ఒక్కసారి మాట్లాడి.. ఎందుకంటే.. మనం 11 గంటలకు టైమ్ ఇచ్చాం..

సండ్ర: ఒక్క నిమిషం నా ఎదురుగానే ఉన్నాడు.



సెబాస్టియన్: హా.. ఓకే.. ఓకే.. సరే మాట్లాడండి

సండ్ర: ఒక్క నిమిషం లైన్‌లో ఉండూ..



సెబాస్టియన్: హా.. హా..

(రేవంత్‌కు ఫోన్ ఇచ్చిన సండ్ర)



సండ్ర ఫోన్‌లో రేవంత్: హలో



సెబాస్టియన్: సార్ చెప్పండి..

సండ్ర ఫోన్‌లో రేవంత్: అదే.. అదే.. ఇక్కడున్నాం సార్ దగ్గర.. పది నిమిషాలు మాట్లాడేసి బయలుదేరుతాం..



సెబాస్టియన్: మరి మీరు అటొచ్చేస్తారా.. నేను బయలుదేరాల్నా? ఆయన ఎదురు చూస్తున్నాడు..

సండ్ర ఫోన్‌లో రేవంత్: అవును.. మీరెక్కడున్నారు?



సెబాస్టియన్: మేమిక్కడ మోతీనగర్.. ఎర్రగడ్డ..

సండ్ర ఫోన్‌లో రేవంత్: మోతీనగరా?.. అయితే ఒక పనిచేయండి.. మీరు అటు పార్టీ అఫీస్ దిక్కు రండి.. నేను అటు వచ్చేస్తా. కారులో కూర్చొని పోదాం..



సెబాస్టియన్: పార్టీ అఫీస్‌లోన సార్?

సండ్ర ఫోన్‌లో రేవంత్: అఫీస్ దగ్గర్నే బండి ఆపుకోండి



సెబాస్టియన్: హా..

సండ్ర ఫోన్‌లో రేవంత్: మనం వెళ్లాల్సింది ఎటువైపు?



సెబాస్టియన్: బోయగూడ

సండ్ర ఫోన్‌లో రేవంత్: ఓకే.. అయితే మీరు పార్టీ ఆఫీస్‌కాడికి రండి.. నాకు ఈజీ అయితది.. ఇది చూసుకొని అడికి వచ్చేస్తా..

సెబాస్టియన్: మంచిది సార్..



సండ్ర ఫోన్‌లో రేవంత్: ఒక్క నిమిషం


సెబాస్టియన్: హా..

(సండ్ర తన ఫోన్ తీసుకున్నాక) సండ్ర: అన్నగారు.. ఒక పనిచేయండి. మీరు ఈ అడ్రస్‌కు మనం ఒక సీక్రెట్ డ్యూటీలో పోయేటప్పుడు అడ్రస్ వెతుక్కోకూడదు.. డైరెక్టుగా పోయేటట్టు ఉండాలి. మీరు ఆఫీస్ కాడికొచ్చి బయట ఉండండి. మనోడు వచ్చేస్తాడు.



సెబాస్టియన్: నేను బయటనే ఉంటా.. ఆడికొచ్చి ఫోన్ చేయలా?

సండ్ర: హా.. పార్టీ ఆఫీస్ ముందు చెట్లు ఉంటాయి కదా.. క్యాంటీన్ పక్కెంబడి.. నీడలో చెట్టు కాడ ఉండండి.



సెబాస్టియన్: మీరక్కడున్నారా?

సండ్ర: లే.. లే.. నేను సారింటికాడ ఉన్న. నీవు... డబుల్ పని వద్దులే..



సెబాస్టియన్: హా.. ఓకే... ఓకే

సండ్ర: ఇద్దరం వద్దులే.. బాగోదు..



సెబాస్టియన్: మీ ఇష్టం.. మీరేమంటే అది..

సండ్ర: మాకేమీ ఇబ్బంది లేదు.. ఎవరు చేసినా పార్టీ పని.. మనోడొస్తాడు..



సెబాస్టియన్: (నవ్వు..)

సండ్ర: మీరు చేసినా.. అన్న చేసిన.. నేను చేసినా ఒకటే, మనది కామన్ ఎజెండా.



సెబాస్టియన్: సరే.. సరే..


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!