గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, అక్టోబర్ 06, 2013

ఉద్యమకారులా...రౌడీమూఁకలా...?!


కేంద్ర మిటు నోటుఁ బెట్టంగఁ, గ్రిందు సేయ
సీమ నాయకు లట దుష్ట చేష్టఁ బూని,
యల్లరులు, దోపిడులు, లూటి, లక్రమములు
చేయఁ బురికొల్పి రిదియేమి చిత్ర మయ్య? (1)

మా తెలంగాణమును దోచు మార్గ మిటుల
మూయఁ బడఁగానె, దోపిడీ మానసములు
మిన్న కుండునె? సీమాంధ్ర మీఱి హద్దు,
దోచుచుండిరి ప్రజల నాందోళన నిడి! (2)

అఱువ దేండ్ల దోపిడిని మే మందఱ మిట
నోర్చి, యుద్యమమును జేయ, నొక్కఁ డైన
“మీకు జరిగె నన్యాయమ్ము; చేకుఱు సుఖ
ము” లనియుఁ బల్కెనే? కర్కశులరుఁ గాదె! (3)

ఇచట నుద్యమ మందున నే యకృత్య
మేని జరిగెనే? యఱువది యేఁడుల నిర
సనము శాంతి యుతముగానె జరిగెఁ గాదె?
యఱువది దినాల సమ్మెలో నవియ యేమి
యల్లరులు, దోపిడులు, లూటి, లక్రమములు? (4)

ఈ నిరాహార దీక్షలు హేళనముకె!
వోట్లు, సీట్లు, కోట్ల కొఱకె పొండు పొండు!!
ఇటఁ దెలంగాణలో నుద్యమించ మీర
లిట్లు దీక్షలు సేసితిరే? దురాశ! (5)

"వేగఁ దెలగాణ బిల్లును బెట్టుఁ, డేము
మద్ద తిచ్చెద" మంచును మాటలాడి;
కేంద్ర మొప్పుకొనంగనే, కృతము మఱచి,
దీక్షలను జేయ నేమండ్రు తెలుఁగు జనులు? (6)

ఉద్యమము ముసుఁగునను దురూహఁ బూని,
దొంగ మూఁకలఁ జేర్చి, విదూషకులయి,
ప్రజల దోచి, ప్రభుత నష్ట పఱచి, కాల
మును గడపఁగను మీకేమి మోద మబ్బె? (7)

మీర లిఁకనైనఁ బ్రజల హింసింప మాని,
దొంగ వేషాలు వదలి, సంతోష మిడెడు
కృత్యములఁ జేయ, బాగుగాఁ బ్రీతి నంది,
ప్రజలు మిముఁ జేరి, నమ్మెద రయ్య నిజము! (8)

కేంద్రమునకు మీరిచ్చిన కృత ప్రతిజ్ఞ
చెల్లు బాటగు నట్టులఁ జేసి, మీరు
ఘనతఁ జాటుకొనిన వేగ గౌరవ యుత
స్థానములు దక్కునయ్య! మీ స్థాయి పెరుగు!! (9)

కాన యిఁకనైనఁ బ్రభుతకుఁ గాంక్షఁ దెలిపి,
రెండు రాష్ట్రాలు సాధించి, ప్రేమఁ గనుఁడు!
బడుగు బహుజన ప్రజల సంబరము నందుఁ
బాలుఁ గొనుఁడు! మీ ఖ్యాతి నిజాలు కనుఁడు!! (10) 

16 కామెంట్‌లు:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

బ్లాగు వీక్షకులకు మనవి. వ్యాఖ్యలు పెట్టేవారు సంస్కార వంతంగా వ్యవహరించాలి. కుసంస్కార యుతమైన, అసంబద్ధమైన, అతార్కికమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు పెట్టి మీ స్వభావం అలాంటిదే ననుకొనేట్టుగా వ్యవహరించరాదని మనవి. మీ మనసులో కుళ్ళుంటే వెళ్ళగ్రక్కడానికి ఇది వేదిక కాదని గ్రహించాలి. హుందాగా, మర్యాదా దాయకంగా మీ వ్యాఖ్యలుండాలని మనవి.

అజ్ఞాత చెప్పారు...

ఉద్యమకారులా...రౌడీమూఁకలా...?! <<<

అవును మధుసూదన్ వర్యా.
టాంక్‌బండ్ మీద విగ్రహాలను కూల్చేసినప్పుడు కూడా ఇదే సందేహం వచ్చింది. ఉద్యమకారులా...రౌడీమూఁకలా...?!
తెలంగాణాలో అడుగుపెడితే తరిమి తరిమి కొడతాం అన్నప్పుడూ ఇదే సందేహం వచ్చింది. ఉద్యమకారులా...రౌడీమూఁకలా...?!

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

చాల చక్కగా సెలవిచ్చారు......

ఉద్యమం ముసుగులో అక్కడ రాజకీయ నాయకులు అధికరం కొరకు ఆడుతున్న వికృత ఆటవిక క్రీడలవి. అక్కడి సామాన్య ప్రజలెవరూ అక్కడి కృత్రిమ ఉద్యమంలో పాలు పంచుకోవటం లేదు.

ఆ కృత్రిమ ఉద్యమం అక్కడి ప్రజలకు మానసిక శాంతినే కాక కరెంటు, నీళ్ళు, ఉద్యోగాలు, ఉపాధి, భోజనం, వైద్యం లేక నానా అవస్థల పాలు జేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్రం కలుగ జేసుకుని ఈ రాజకీయ నాయకుల వికృత క్రీడల అరికట్టి అక్కడి సీమాంధ్ర ప్రజలకే కాక అందరికీ మనశ్శాంతిని కలుగ జేయాలి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చూడండి అజ్ఞాత వర్యా! తమరింత వెటకారముగా చెప్పనవసరం లేదు. మాకూ మీకూ పోలికలా? అరవై ఏళ్ళ సహనం మాది! ఒక్క రోజుకూడా సహనంతో ఉండని వాళ్ళు మీరు. తెలంగాణ ప్రకటన వెలువడగానే ఇంతెత్తున ఎగసి పడ్దారు మీరు! నోట్ వెలువడగానే మీ సీమాంధ్రుల్నే దోపిడీ చేసే స్థితికి ఎదిగారు. మీరు మాకు నీతులు చెప్పేవారా? అనను. మా ఆవేదనను మీరు ఇంతే అర్థం చేసుకున్నారని బాధపడతాను. మా ఆవేదన ఎలాంటిదో... ఎందుకు మేం ఆత్మ న్యూనతకు గురికాబడ్డామో ఈ బ్లాగు చూడండి. మీకే తెలుస్తుంది రౌడీ మూకలెవరో?!
||::THE-TELANGANA::|| : వి'గ్రహాల' విద్వంసం!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మీరన్నది అక్షరాలా నిజం మల్లికార్జున స్వామిగారూ! భగవంతుడు వారికి సుహృద్భావ మానసాన్ని కలుగజేయుగాక!

Unknown చెప్పారు...

చెట్టుని పెంచి..పెద్ద చేసి..సరిగ్గా అది పళ్ళు ఇచ్చే సమయానికి అది నాది..నా సెంటిమెంటు చెట్టు..నాకు మత్రమే దాని మీద హక్కు వుంది అనటం న్యాయమా...? ఏ ప్రాతిపాదికన విడిపొతారు...మీది ఏ భాష..? మీది ఏ లిపి...? అన్నీ తెలుగు నుండి తీసుకొవలిసిందే కదా...ఉద్యమాన్ని మొదలు పెట్టిన వాడిదే ఆ ప్రాంతం కాదు..ఒక హైదరాబాద్ పొతే అలాంటి నగరాలు కనీసం 10 నిర్మించి చూపిస్తాం..ఈ లొపు మీకు దమ్ముంతే సొంత భాష, సొంత లిపి తయారు చెసుకొండి చుద్దాం...

Unknown చెప్పారు...

" మీ మనసులో కుళ్ళుంటే వెళ్ళగ్రక్కడానికి ఇది వేదిక కాదని గ్రహించాలి"
mari thamaru chesthunnadi yemiti sir...?

aditya చెప్పారు...

భయ్యా
మన తెలంగాన మనకొచ్చిందిగా. వాళ్ళు వాళ్ళు దొబ్బిచుకుంటారు. మనకెందుకు. ముందు టి-బిల్లు పార్లమెంట్లో పాస్ చెయించే పనిలో వుండండి. వాళ్ళ మీద సానుభూతి అనవసరం.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అజ్ఞత పేరిట కుళ్ళును అసభ్యపదజాలంతో వెళ్ళగ్రక్కేవాళ్ళనుగూర్చి నేనంటే మీ కెందుకంత పౌరుషం వస్తోంది? కొంపదీసి అలాంటి అసభ్య, అనాగరక, అసందర్భ, ఉన్మాదపు కూతలు కూసింది మీరేనా?
మా ఆవేదన మీకు మరోలా కనిపిస్తే...ఏమనాలి?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అసలు ఆ చెట్టును నాటింది, పోషించి వృద్ధిపొందించింది మా తాతముత్తాతలు! మీరు ఆ చెట్టునీడన చేరిన బాటసారులు! చెట్టుకింద ఉండి ఉండి చివరికి ఆ చెట్టే మాదంటున్నారు మీరు. మీకెలా హక్కు వస్తుంది? మన దేశాన్ని పాలించి, వ్యాపారాభివృద్ధికై తెల్లవాళ్ళు ఎన్నో రోడ్లు వేశారు. భవనాలు నిర్మించారు. రైలుమార్గాలు నిర్మించారు. ఎంతో అభివృద్ధి పరిచారు. అంత మాత్రాన ఈ దేశం మాదంటే ఒప్పుకుంటామా? అలాగే ఇదీనూ.
భాష విషయానికొస్తే...మీ సీమాంధ్రులు రాకముందు మాకు భాష లేదనా మీ ఉద్దేశం? మాది సజీవమైన, స్వచ్ఛమైన భాష. మా భాషనూ, యాసనూ అవహేళన చేస్తేనే కదా...మా ఆత్మాభిమానం దెబ్బతింది? మీ భాష కృతకమైన భాష. పై పై మెరుగుల భాష. అండీ అండీ. అంటూ అణగద్రొక్కే భాష. అలాంటివారు మమ్మల్ని సొంతలిపి తయారుచేసుకొమ్మంటారా? గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట! మాకు లిపి లేదనీ, మీరొచ్చి నేర్పారనీ మీకెవరు చెప్పారు? ఇంత అజ్ఞానం ఉన్న మీతో ఇంత వాదించటం కూడా అనవసరం.
పది హైదరాబాదులు నిర్మించుకోగల సత్తా ఉన్నవారు ఊరికే ఉత్తరునిలా ప్రగల్భాలు పలుకుతూ ఉండరు. నిర్మించుకొనే సత్తా ఉన్నవారు నిర్మించి చూపిస్తారు గానీ హైదరాబాదుపై మాకే హక్కుంది అంటూ వాదించరు. మీ సత్తా నిరూపించుకోండి. పది హైదరాబాదులు నిర్మించుకోండి. సంతోషిస్తాం.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అలాగే ఆదిత్య భయ్యా!

Mandhubabu చెప్పారు...

Sir mee padhyaalu entha baagunnayo mee replys kuda antha ghaatugaa nijayith gaa unnayi.

Hats off sir,

vaddhu sir,, valla basha manaku vaddhu.. piki andi andi anukuntene mana gundilanni tesesthaaru..

manamu era poradaa anna manassulo prema untundhi.

aa andhrolla daridhrapu basha vadhhu sir.

aiana daaniki mana basha ki polikenti sir.. telugu ku mulamu enti sir..

enti babau 10 hyd li thayaru chesthaavaa.. 10 kakapothe 100 chesuko.. ninnevadinaa aapaadaa.. velli chesukoraa babau ante malli maa hyd kavalantaaavu.

ee kapata matala valle raa metho memu undalemu separate kavalane udhyamamu vachhindhi.

ainaa maa peddhollu chepparu.. idipoyaamu. inka vallatho manaku pani ledhu.. manamu mana abivurddhi chusukundhaamu. manamu koloyinavi annai thirigi tecchukundhaamu.

jai telangana..

jai telangana..

anna e andhrollani manamu emi anavsaramu ledhu: valle kulagajji and muta thagadhalalo vallaku valle kottukoni chasthaaru.

Satish. చెప్పారు...

సహనమా ...ఇప్పటికే జనాలు నవ్వుతున్నారు. తెలంగాణా ఇవ్వలేము అని 2009 లో చెప్పినప్పుడు మీరు ఏమి చేసారో మర్చిపొయారా..

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఏం చేశాం? సీమాంధ్రుల ఇళ్ళు కొల్లగొట్టామా? రౌడీల్లా షాపుల్ని ధ్వంసం చేసి, దోపిడీ చేశామా? ఈ కేంద్రం తెలంగాణ ఇవ్వదని, ఇచ్చినా ఈ సీమాంధ్రులు ఇవ్వనివ్వరని మా యువతే ఆత్మహత్య్లు చేసుకున్నారు. మీ సీమాంధ్రులకు ఏ హానీ తలపెట్టలేదు! అలాంటి హుందాతనం మాది. మీలా చవకబారు వేషాలు వేసేవాళ్ళం కాం మేం. మానవత్వం లేని మీ లాంటి వాళ్ళతో, గతం తెలియని అజ్ఞానులతో వాదన అనవసరం. మా బాధను అర్థం చేసుకున్నవాళ్ళే మా వాళ్ళు.

Chandu చెప్పారు...

super sir hats off

అజ్ఞాత చెప్పారు...

Gaa Andhra falthugallatho manakende... kallaku cheppulu lekunda ikkadikochi mana vanarulu dobbi tini idanta maade anturru...paina devudunnadu... nyayam mana pakshana undi... anduke telangana vachindi... aa kodukulu koose koothalu pattinchukovalsina Pani ledu.... leave it...

కామెంట్‌ను పోస్ట్ చేయండి