గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, అక్టోబర్ 15, 2013

తెలంగాణ జాతిపితకు అశ్రునివాళి...


తేది: జూన్ 21, 2011 నాడు మన తెలంగాణ జాతిపిత, మన మార్గ ప్రదర్శకుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్వర్గస్థుడైన వార్త వినగానే నాలో నుండి పెల్లుబికిన అశ్రునివాళి… 

ఉత్పలమాలిక: 

“ఓ తెలగాణ జాతిపిత! యో జయశంకర! యో గురూత్తమా!
మా తెలగాణ నేతలకు మార్గ ప్రదర్శనఁ జేసి, నిత్యమున్ 
జాతికిఁ జేతనమ్ము నిడి, చల్లని మాటల స్ఫూర్తి నిచ్చియున్, 
నీతి నిజాయితిన్ నిలిపి, నీ చిరకాల స్వరాష్ట్ర కాంక్షమై 
యీ తెలగాణ యుద్యమము నెంతయొ ముందుకుఁ బోవఁ జేసి, నీ 
చేఁతలతోన రాష్ట్ర మిట సిద్ధియు నొందక మున్న దైవమై 
మా తలరాత మార్చు వర మీయఁగ నెంచియు స్వర్గగామివై 
పోతివి దుఃఖవార్ధి మము మున్గఁగఁ జేసియు మమ్ము వీడియున్! 
యాతన మాకు శేష మయె; వ్యాకుల చిత్తుల మయ్యు మేమిటన్ 
జేతుము నీకు వందనము శీర్షము వంచి, మహోత్తమాశయా! 
చేతుము రాష్ట్ర సిద్ధి, ఘన చిత్తతతో నిఁక నుద్యమించి, యో 
యీ! తెలగాణమాత సుత! యీ తెలగాణము రాష్ట్ర మయ్యెడున్!” 


(నాటి నా మాట నేడు యథార్థము కాబోతున్నదనే ఆనందం…తెలంగాణ రాష్ట్రోదయాన్ని కన్నులారా తిలకించడానికి మా తెలంగాణ జాతిపిత లేడుకదా అనే విచారం…రెండు కలగలసిన ద్వైధీభావం నా మనస్సును ఆవరించింది. హే భగవాన్! మా మార్గదర్శి ఆత్మకు శాంతిని ప్రసాదించమని మాత్రమే నేను కోరగలను. అంతకు మించి ఏమి చేయగలను?)

జై తెలంగాణ!          జై జయశంకర్ జీ! 

4 కామెంట్‌లు:

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

తెలంగాణా ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి పాత్ర మరువలేనిది - అతడు చిరస్మరణీయుడు. తెలంగాణా రాష్ట్ర సిద్దితోనే అతని ఆత్మకు శాంతి చేకూరుతుంది - ఆ తరుణంకై నిరంతర పోరాటం సాగావలసిందే.

Mandhubabu చెప్పారు...

good one..

Jai jaya shankar.. jai telangana.. jai jai telangana..

sir, we are missing u

అజ్ఞాత చెప్పారు...

నవ తెలంగాణ మాత్మగౌరవము నంది
మేటి రాష్ట్రమై జనులకు మేలు గూర్చి
వంకలేని గురువు జయశంకరునకు
నిడు నివాళి యనెడు పద్య మిపుడు వ్రాసి
మోద మొసగితి విదె మధుసూదనార్య!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

"వందనమ్ము లో యజ్ఞాత వర్య మీకు!"

కామెంట్‌ను పోస్ట్ చేయండి