గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, సెప్టెంబర్ 19, 2014

తెలంగాణ ఎమ్మెల్యేపై ఆంధ్రాబాబులదాడి...!!!

-తీవ్రంగా గాయపడ్డ అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
-దాడిలో ఏలూరు ఎంపీ, పోలవరం ఎమ్మెల్యే, అనుచరుల పాత్ర!
-ఖమ్మం జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలో ఘటన
తెలంగాణ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), పోలవరం ఎమ్మెల్యే మొడెం శ్రీనివాసరావు, వారి అనుచరులు దాడిచేసి గాయపరిచారు. ఖమ్మంజిల్లా కుక్కునూరు మండలంలో భౌగోళిక పరిస్థితులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ బాబురావునాయుడు, సీఈవో రవీందర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజువర్మ, వివిధశాఖల అధికారులు గురువారం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయానికి వచ్చారు. స్థానిక అధికారులతో సమావేశం జరుగుతుండగా ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కుక్కునూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు.
mlaవిషయాన్ని తెలుసుకున్న ఆంధ్రా అధికారులు అక్కడికి చేరుకొని సమస్య పరిష్కారానికి ఇరు రాష్ర్టాల ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి, అక్కడ నుంచి తిరిగి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు కనీసం ఇక్కడ జరిగే సమావేశం గురించి సమాచారం లేదని, ఇది ఎంత వరకు సబబు అని ఆంధ్రా అధికారులను ప్రశ్నించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

దీనికి ఆగ్రహించిన ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వర్‌రావు (బాబు), పోలవరం ఎమ్మెల్యే మొడెం శ్రీనివాసరావు, వారి అనుచరులు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై విరుచుకపడ్డారు. తెలంగాణ ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కిరాతకంగా వ్యవహరించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే తాటి తీవ్రంగా గాయపడ్డారు. జరిగిన ఘటన పట్ల ఆవేదనకు లోనైన ఎమ్మెల్యే ప్రధాన రహదారిపై సుమారు మూడు గంటలపాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయారు. స్థానిక పోలీసులు ఎమ్మెల్యేను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యేపై దాడి జరుగుతుంటే స్థానిక పోలీసులు చూస్తూ నిలబడ్డారే తప్ప కనీసం అడ్డుకున్న పాపానపోలేదు. పోలీసుల వైఖరి పట్ల తీవ్ర నిరసన వ్యక్తమైంది. తాటి వెంకటేశ్వరరావును ఆంధ్రా ఎంపీ, ఎమ్మెల్యే, అనుచరులు గాయపరిచిన సంఘటనను తెలుసుకున్న ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఎమ్మెల్యేను పరామర్శించారు.

జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ మండలాలను స్వాధీన పరుచుకునేందుకు ఆంధ్రా అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కనీసం స్థానిక ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా, విలువనివ్వకుండా తమ కార్యకలాపాలు కొనసాగించడం పట్ల ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
                             జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి