గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, సెప్టెంబర్ 18, 2014

ఆ కథనాలు సీమాంధ్ర మీడియా ఉద్దేశపూరిత కల్పనలే...!!!

-ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేసే దుష్ప్రచారం
-మెట్రో నిర్మాణానికి పూర్తిస్థాయి సహకారం
-హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాం
-పదేండ్ల్లు హైదరాబాదే ఉమ్మడి రాజధాని
-ఎల్‌అండ్‌టీ అధికారులతో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. మెట్రో పనులు ఆపేస్తామని ఎల్‌అండ్‌టీ అనలేదని, కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సాయం కోరారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వాటి పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంది.


kcr01
మెట్రో రైలు నిర్మాణం నుంచి వైదొలగాలని ఎల్‌అండ్‌టీ భావిస్తున్నదంటూ రెండు పత్రికల్లో వచ్చిన వార్తలను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెట్రో అధికారులతోపాటు, సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్ సీఈవో వీబీ గాడ్గిల్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి, స్పష్టమైన ప్రభుత్వం ఏర్పడినందున నిర్ణయాలను వేగంగా తీసుకొని మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల పూర్తికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని సంస్థ సీఈవో గాడ్గిల్‌కు ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రభుత్వాలు మెట్రో అధికారుల లేఖలకు సరిగా స్పందించలేదని, విభజన సమయంలో పరిపాలన కుంటుపడటంతో నిర్ణయాలు తీసుకోవడంలో సీమాంధ్ర నేతలు అలసత్వం వహించారని సీఎం వారికి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ర్టాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికే కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై పనికట్టుకొని కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని సీఎం వారికి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్వహణ సాధ్యం కాదని, ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిపోతుందని పేర్కొంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల్లో నిజం లేదని ఎల్‌అండ్‌టీ సీఈవోకు స్పష్టం చేశారు. 

రాష్ట్రం విడిపోయినా పదేండ్లు రెండు రాష్ర్టాలకు హైదరాబాదే ఉమ్మడి రాజధాని అని, విభజన బిల్లులోనే ఇది స్పష్టంగా ఉందని మెట్రో అధికారులకు సీఎం గుర్తు చేశారు. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొదటి దశ పనులను పూర్తి చేసి, రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో మార్గాన్ని మరో 130 కిలోమీటర్లకు విస్తరించాలని కూడా సీఎం వారికి చెప్పారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, రెవిన్యూ, జీహెచ్‌ఎంసీ, రవాణాశాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మెట్రో ప్రాజెక్ట్ రెండో దశ పనులు చేపట్టే విషయాన్ని కేంద్రంతో చర్చించేందుకు ప్రభుత్వ సలహాదారు పాపారావు, సీఎస్ రాజీవ్‌శర్మ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. మెట్రో రైల్ నిపుణుడు ఈ శ్రీధరన్‌నుంచి కూడా వారు సలహాలు స్వీకరిస్తారని పేర్కొంది.

అసత్య ప్రచారం తగదు: ఎల్‌అండ్‌టీ
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఓ వర్గం మీడియా అసత్య ప్రచారం చేయటం తగదని పేర్కొంటూ ఎల్‌అండ్‌టీ కమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ సంజయ్‌కపూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నుంచి పూర్తి సహకారం అందుతున్నదని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో గతంలో ఏపీ సర్కారుతో అనేక సంప్రదింపులు జరిగాయని, అలాగే తెలంగాణ ప్రభుత్వంతో నిరంతరం సాగుతుంటాయని అన్నారు.

ఎల్‌అండ్‌టీకి, ప్రభుత్వానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాధారణమని, ఇదేం కొత్త కాదని తెలిపారు. వాస్తవాలు, పూర్తి వివరాలు, సమాచారం తెలుసుకోకుండా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అభాసుపాలు చేయాలని చూడటం సరికాదన్నారు. మెట్రో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని, పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. దేశంలోనే వేగంగా సాగుతున్న ప్రాజెక్టు ఇదని స్పష్టం చేశారు. ఇలాంటి కథనాలు రాయటం బాధాకరంగా ఉందని, ప్రజలను తప్పుదోవ పట్టించటం సరికాదని ఆ ప్రకటనలో తెలిపారు.

కుట్రరాతలతో..మెట్రో ఆగదు
తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్ట్ర వికాసాన్ని స్థానికులు కోరుకుంటున్నారు. రాష్ట్ర వికాసానికి జరుగుతున్న కృషిని దేశమంతా నిశితంగా గమనిస్తున్నది. పారిశ్రామికవేత్తలు నూతన తెలంగాణపై ఎంతో ఆశతో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సత్యదూరమైన వార్తా కథనాలు వస్తే.. తెలంగాణకు నష్టం చేస్తాయి. తెలంగాణ వికాసాన్ని స్వాగతించాలని కోరుతున్నాం.


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని భగ్నం చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పకడ్బందీ ప్రణాళికతో గ్రామస్థాయి నుంచి తెలంగాణ సమగ్ర అభివృద్ధికి గొప్ప కృషి జరుగుతున్నది. ఈ ఇమేజ్‌ను దెబ్బతీయడమే సీమాంధ్ర పత్రికల ప్రయత్నం. తెలంగాణ ప్రజలు ఈ పత్రికలను ఏనాడో తిప్పికొట్టారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అపహాస్యం చేసే పత్రికలను కూడా నిషేధించాలి. 


మెట్రోరైలు ప్రాజెక్ట్‌ను ఆపాలని పత్రికలు కుట్రలు చేసినంత మాత్రాన మెట్రోరైలు ఆగదు. కుట్రలు చేసిన పత్రికలు మాత్రం ఆగిపోతాయి.


ప్రతీ విషయంలో రాద్దాంతం చేయడం.. భంగపడటం సీమాంధ్ర పత్రికలకు అలవాటుగా మారిపోయింది. ఈ దుర్మార్గాలను, కుట్రలను ప్రజలు ఎప్పటికప్పుడు చీల్చి చెండాడుతున్నారు. మళ్లీ అసత్యవార్తల పత్రికలను చెత్తబుట్టలో వేయడం ఖాయం. 


తెలంగాణ ఉద్యోగులు, అధికారుల మీద దాడులు చేయడం, తెలంగాణ అభివృద్ధిని సహించకపోవడం, తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఇవన్నీ కుట్రలే.. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని చూసి సహించలేకపోవడమే.


తెలంగాణలో ఏ పనినీ ఆపలేరు. కుట్రరాతలతో మెట్రో ఆగదు. తెలంగాణ ప్రభుత్వానికి సైనికుల్లా పనిచేస్తాం. 


వార్తా కథనాలతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని నిరోధించలేరు. ఎన్నోసార్లు ఇలాంటివి రాశారు. తెలంగాణ ప్రజల ముందు ఓడిపోయారు. మళ్లీ తప్పుడు కథనాల పత్రికలు ఓటమిని అంగీకరించక తప్పదు.


తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ అండదండలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ పత్రికల కథనాలు అసత్యాలు. వాటిపై చర్యలు తీసుకోవాలి. 


తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సారధ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటును జీర్ణించుకోలేని ఆంధ్ర పెత్తందారులు, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు మెట్రోరైలు ప్రాజెక్టుపై అసత్య కథనాలతో ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న తరుణంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసే లక్ష్యంతోనే మెట్రో రైలుపై ఎల్‌అండ్‌టీ చైర్మన్ గతంలో రాసిన లేఖను ఇప్పుడు బహిర్గతం చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై ఆంధ్ర నేతలు చేస్తున్న పరోక్షయుద్ధానికి ఎల్ అండ్ టీ సహకరించడం విచారకరం. తన చేతగానితనాన్ని ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నాన్ని ఎల్ అండ్ టీ సంస్థ విరమించుకోవాలి.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
                             జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

4 కామెంట్‌లు:

jaya చెప్పారు...

ayya !
meeru kavigaa naaku abhimaanam
kaanee meeru andhra prajalanu tidutoo saahityaparamgaa meeku unna perunu naasanam chesukuntunnaaru anipistundi .
c narayanareddy inkaa endaro telangaanaa kavulu seemandhrulanu tittaledu
dayachesi titlu aapandi
appudu mee peru dasa disalaa maaru mrogutundi

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్వలేక పోతున్నారు. గోతులు తీసేవారు చివరకు తాము తీసిన గోతిలోనే పడతారు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అయ్యా Dare2Write గారూ,

మీరు పొరబడుతున్నారు. నాకు సీమాంధ్రులు సోదరసమానులు! నేను మా తెలంగాణకు ద్రోహం చేసే సీమాంధ్ర మీడియావాళ్ళను దుయ్యబట్టుతున్నాను. అలాగే తెలంగాణకు ద్రోహం చేసే అక్రమార్కులకు చురకలంటిస్తున్నాను. అంతేగానీ, సీమాంధ్రసోదరులను పల్లెత్తు మాటగూడా అనడం లేదు. మాకు అన్యాయం చేసేవాళ్ళ దుండగాల్ని మీరు వెనకేసుకొనివస్తారా మీరు? కాదు కదా! అలా చేస్తే మీరు మాకు సోదరులెలా అవుతారు? దయచేసి నన్నాపకండి. దుష్టుల దురన్యాయాల్ని బట్టబయలు చేయనివ్వండి. ఎల్లప్పుడూ మీకు నేను మీ అభిమానంపొందేవానిగానే నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. స్పందించినందులకు ధన్యవాదాలతో... స్వస్తి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నిక్కము వక్కాణించితిరి స్వామిగారూ! అధర్మం ప్రస్తుతం పైచేయిగా వున్నా, చివరికి ధర్మమే జయిస్తుంది!! స్పందించి వ్యాఖ్య పెట్టినందులకు ధన్యవాదాలు. స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి