-మంగళవారం కొనసాగిన కూల్చివేతలు
-కలెక్టర్ ఆదేశాలతో వివిధ శాఖలు రంగంలోకి
గండిపేట చెరువు భూములు కబ్జా చేసిన ఆక్రమణదారుల గుండెల్లో వణుకుపుట్టింది. రాజకీయ అండదండలతో ఏం చేసినా చెల్లుతుందని భావించిన సీమాంధ్రబాబులు సర్కారు కన్నెర్ర చేయడంతో గడగడలాడుతున్నారు. జలాశయం పరిసరాల్లోని పట్టా భూముల్లో ఎకరం కొని జలాశయం పరిధిలోకి వచ్చే ఐదెకరాలు ఒకడు కబ్జా చేస్తే.. మూడెకరాలు కొని పదెకరాలు కబ్జా పెట్టింది ఇంకొకడు.. ఇలా అనకొండలాగా జలాశయాన్ని మింగుతూపోయారు. వీరి పాపం పండి ఈ బాగోతం వెలుగు చూడడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది.-కలెక్టర్ ఆదేశాలతో వివిధ శాఖలు రంగంలోకి

మంగళవారం ఒక్కరోజే సుమారు 20 ఎకరాల కబ్జాలను తొలగించినట్లు చెప్పారు. తాము ఊహించిన దానికి పదిరెట్లు చెరువు భూములు ఆక్రమణలకు గురయినాయని అధికారులు చెప్పారు.ఆక్రమణల తొలగింపునకు ఎక్కువ సమయం పట్టేలా ఉందన్నారు. జీఐఎస్ సర్వేతో హద్దులు తనిఖీ చేసి ఎక్కడ ఆక్రమణ జరిగినా, ఏ నిర్మాణం ఉన్నా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని చెప్పారు. ఇదిలాఉండగా జలాశయాన్ని కబ్జా పెట్టిన ఆక్రమణదారులు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలపై వత్తిళ్లు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ కబ్జాలను లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానికులు సిద్ధమౌతున్నారు.
ఉపేక్షించే ప్రసక్తే లేదు : నరహరి, జిల్లా సర్వే ఏడీ
జలాశయ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్న వారు ఎవరైనా ఊపేక్షించే ప్రసక్తేలేదు. కోట్లాది మంది ప్రజల దాహార్తిని తీర్చే జలాశయ పరిరక్షణ కోసం ప్రత్యేక నిబంధనలున్నా యి. వాటిని ఉల్లంఘించడం చట్టపరమైన నేరం.ఈ కబ్జాలపై సమగ్ర సర్వే నిర్వహించి కలెక్టర్‌కు నివేదిస్తాం.
ఎఫ్‌టీఎల్ నిర్ధారించండి... క్షణాల్లో కూల్చివేస్తాం
చెరువు భూములను కబ్జాలను తొలగించేందుకు రెవెన్యూశాఖ సిద్ధంగా ఉంది. జలమండలి అధికారులు చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్థారించి చూపితే ఆక్రమణలన్నింటినీ తక్షణమే కూల్చిపారేస్తాం అని తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి