- పోలవరం ముంపు గ్రామాల ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలి: దేవీప్రసాద్
రాష్ట్ర విభజన నేపథ్యంలో పదో షెడ్యూల్‌లో నెలకొల్పిన కార్యాలయాలన్నింటినీ విభజించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో కమల్‌నాథన్ కమిటీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మరోసారి ఇదే విషయంపై ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను శుక్రవారం కలిసి సమస్యలు వివరించామని చెప్పారు. ఈ సందర్భంగా సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు సబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని విమర్శించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి