-పార్లమెంట్‌లో చర్చించకుండానే ఆర్డినెన్స్ జారీ దారుణం
-బాబు, వెంకయ్యలదే కుట్ర.. కేంద్రానిది నిరంకుశ ధోరణి
-భద్రాచలం రాముడిని జలసమాధి చేయడం విడ్డూరం
-పోలవరం వ్యతిరేక సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్
పార్లమెంట్‌లో చర్చించకుండానే దొడ్డిదారిలో కేంద్రం పోలవరం పై ఆర్డినెన్స్ జారీచేసిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా భద్రాచలంలో తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన పోలవరం అక్రమ ఆర్డినెన్స్ వ్యతిరేక సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల పెట్రో కెమికల్, కోస్టల్ కారిడార్ అవసరాల కోసమే కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని విమర్శించారు. రాముడి పేరు చెప్పి గతంలో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం..పోలవరం నిర్మాణం పేరుతో భద్రాచల రాముడినే జలసమాధి చేయడానికి పూనుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టుపై ఆర్డినెన్స్ తెచ్చారని, దీని వెనుక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల కుట్ర దాగిఉందన్నారు. -బాబు, వెంకయ్యలదే కుట్ర.. కేంద్రానిది నిరంకుశ ధోరణి
-భద్రాచలం రాముడిని జలసమాధి చేయడం విడ్డూరం
-పోలవరం వ్యతిరేక సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్

ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు
పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలం డివిజన్‌లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వరరామచంద్రాపురం మండలం రేఖపల్లిలో రెండ్రోజులుగా కొనసాగుతున్న దీక్షలను యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ నర్సింహారావు సందర్శించి మాట్లాడారు. దీక్షలో పాల్గొన్న సర్పంచ్‌లకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడానికి అక్రమ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన కేంద్రం ప్రజల పక్షాన ఉంటుందో, ప్రజలను ముంచాలనుకుంటుందో తేల్చాలని డిమాండ్‌చేశారు. ఆర్డినెన్స్‍ను ఉపసంహరించుకోవాలని, తెలంగాణలోనే ముంపు ప్రాంతాన్ని కొనసాగించాలని కోరారు. భద్రాచలంలో కొనసాగుతున్న దీక్షలను టీపీటీఎఫ్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి