గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 16, 2014

ఉద్యమాన్ని చులకన చేసిన ’ఆ నలుగురికి’ కీలక పదవులా..!?

-తెలంగాణ ఉద్యమంలో చులకనగా వ్యవహరించిన ఐపీఎస్‌లు
-వారికి కీలక పోస్టింగులు ఇవ్వడంపై ఆగ్రహం
-మార్చాల్సిందేనంట్ను తెలంగాణ ఐపీఎస్‌లు
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చులకనగా మాట్లాడిన కొంతమంది ఐపీఎస్‌లకు కీలక పోస్టులు కేటాయించడపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వారికి పోస్టింగులు ఎలా ఇస్తారని తెలంగాణ ఐపీఎస్‌లు ప్రశ్నిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఇలాంటి వారికి పనికిరాని పోస్టింగులు ఇస్తే.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తాత్కాలిక కేటాయింపుల్లో వారికే అగ్రతాంబూలం ఇవ్వడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై వివిధ రకాల వేధింపుల కేసులు పెట్టి, లాఠీలు ఝళిపించిన ఓ ఐపీఎస్‌ను ఏకంగా ఓ విభాగానికి అధిపతిని చేయడాన్ని తప్పుబడుతున్నారు. తెలంగాణ ఐపీఎస్‌లను, పోలీస్ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన మరో అధికారికి కీలక పోస్ట్ కేటాయించడం వివాదంగా మారింది. ఇలాంటి మరో ఇద్దరికి కూడా పెద్దపీట వేయడాన్ని తెలంగాణ ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు తప్పుబడుతున్నారు. ఈ నలుగురిని తెలంగాణకు కేటాయించడమే అన్యాయం అనుకుంటే.. వారికే కీలక బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.

డీజీపీ దృష్టికి ఆ ఐపీఎస్ వ్యవహారం!

తెలంగాణ ఉద్యమంలో అవకతవకగా వ్యవహరించి ఇప్పుడు కీలక పోస్టులు చేపట్టిన ఐపీఎస్‌ల వ్యవహారాన్ని సీనియర్ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఇలాంటి అధికారుల వల్ల మిగతా అధికారులు సరిగ్గా పనిచేయలేరని, వీరి ప్రభావం వారిపై పడుతుందని డీజీపీకి చెప్పినట్టు తెలిసింది. ఈ నలుగురు అధికారులపై త్వరలోనే వేటుపడే అవకాశముందని సీనియర్ పోలీస్ అధికారుల్లో వినిపిస్తోంది. వీరు గతంలో తెలంగాణను అవమానించేలా మాట్లాడినా.. వీరికి ఇలాంటి కీలక పోస్టింగ్‌లు రావడం ఎలా సాధ్యమైందన్న చర్చ వారిలో నడుస్తోంది. తెలంగాణకు చెందిన మరో సీనియర్ పోలీస్ అధికారే వారికి కీలక పోస్టింగ్‌లు వచ్చేలా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

indulo kuda babu kutra undemo !

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

బాబు కుట్ర లేనిది ఎందులో? బొల్లిబాబు కుట్రవల్లనే తెలంగాణలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి! వీటిని త్రిప్పికొట్టాల్సిన అవసరం మన సీఎం కేసీఆర్‍గారికే ఎక్కువగా ఉన్నది! మన తెలంగాణ ప్రజలందరూ దీనికి మద్దతు తెలపాలి!

కామెంట్‌ను పోస్ట్ చేయండి