-గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
-పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగినందున తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి.. ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరించాల్సిందిగా గవర్నర్‌ను సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం.-పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి