గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 10, 2015

తెలంగాణలో ఉన్న 97 ఉమ్మడి సంస్థలు తెలంగాణవే!!!



-అధికారం, ఆస్తిపాస్తులు మనకే
-తెలంగాణ సంస్థల ఏర్పాటుతో ఏపీ సంస్థల అంతర్థానం
-హైకోర్టు తీర్పుతో స్పష్టత.. సంస్థల స్వాధీనం మొదలు
-చెరుపబోయి చెడ్డ ఆంధ్రప్రదేశ్
-హైకోర్టు తీర్పుపై స్టే కోసం ఏపీ ప్రయత్నాలు
కొండనాలుక్కి మందేస్తే ఉన్ననాలుక ఊడిందని ఉన్నత విద్యామండలి మీద పేను పెత్తనం కోసం కోర్టుకెక్కిన ఏపీకి అసలుకే ఎసరు వచ్చింది. ఈ నెల 1న వెలువడిన హైకోర్టు తీర్పు అనేక చిక్కుముళ్లకు పరిష్కారం చూపింది. ఈ తీర్పు ఫలితంగా ఇవాళ తెలంగాణ భూభాగంలోని మరో 97 సంస్థలు మనకే దక్కబోతున్నాయి. కుంటిసాకులతో.. గుడ్డిసాకులతో అధికారం చెలాయించి ఇక్కడి ఆస్తులు, నిధులు కొట్టేయాలని చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి తెలంగాణలో చిల్లిగవ్వ దక్కదని తేటతెల్లమైంది. వాస్తవానికి రాష్ట్ర విభజన చట్టం చాలా స్పష్టంగా తెలంగాణ భూభాగంలో కొనసాగుతున్న ఉమ్మడి సంస్థలపై సంపూర్ణ అధికారం తెలంగాణ ప్రభుత్వానికే ఉంటుంది అని చెప్పింది. ఉన్నత విద్యా మండలిపై అధికారం తెలంగాణకే చెందుతుందని ఈ నెల 1న వెలువడిన ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం కూడా ఇదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. 

చేయాల్సింది ఏమిటి?..


హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సంస్థల స్థానంలో తెలంగాణ సంస్థలు ఏర్పాటైతే ఆ స్థానంలో ఏపీ సంస్థలన్నీ ఉనికి కోల్పోతాయి. సదరు సంస్థలు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ భూభాగంలో ఉమ్మడి సంస్థలు కొనసాగడానికి కొంత గడువు విధించారు. ఆలోపలే అన్ని రకాల ఉమ్మడి కార్యాలయాలలో తెలంగాణ సంస్థలు ఏర్పాటు చేసుకోవాల్సింది. ఏపీ ప్రభుత్వం కూడా తమ సంస్థలు తమ భూభాగంలో ఏర్పాటు చేసుకోవాలి. 

ఉనికి కోల్పోనున్న 107 ఉమ్మడి సంస్థలు..


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి ఉమ్మడి రాష్ట్రంలో 107 సంస్థలు ఉమ్మడిగా కొనసాగుతున్నాయి. వీటిలో 97 సంస్థలు తెలంగాణ భూభాగంలో, 10 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నాయని సమాచారం. జూన్ 2, 2014 అపాయింటెడ్ డే నుంచి ఏడాదిలోగా వీటిని విభజించుకోవాలి. ఆ మేరకు ఉమ్మడి సంస్థల స్థానంలో ఇప్పటికే కొన్ని తెలంగాణ సంస్థలు ఏర్పాటయ్యాయి.

ఈ క్రమంలోనే తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటైంది. కోర్టు తీర్పు స్ఫూర్థితో మన రాష్ట్రంలో కొనసాగుతున్న 97 ఉమ్మడి సంస్థలు మేల్కొన్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు స్పందించి తెలంగాణ ఇంటర్మీడియేట్ భవనంలో కొనసాగుతున్న ఏపీ ఇంటర్ బోర్డును తమకు వదిలేయాలని విజ్ఞప్తి చేయబోతుంది. ఇదే క్రమంలో అన్ని రకాల ఉమ్మడి విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నత విద్యా మండలి తీర్పు అనుసరించి హైకోర్టు నుంచి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.

మళ్లీఆంధ్రా కుట్రలు..


తెలంగాణ విద్యామండలి ఏర్పాటు కావడంతో ఏపీ విద్యా మండలి ఉనికిలో లేదని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పులో స్పష్టం చేయడంతో ఏపీ ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఈ తీర్పు అమలును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేయడానికి ఏపీ అధికారులు ఢిల్లీకి వెళ్లారు.

మన రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి సంస్థల జాబితా ఇలా ఉంది...


ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ, ఏపీ స్టేట్ కౌన్సెల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ ఎంసీహెచ్‌ఆర్‌డీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ అండ్ ట్రైనింగ్, ఏపీ పోలీస్ అకాడమీ, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఏఎంఆర్ ఏపీ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, శ్రీరామానంద తీర్థ ట్రైనింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్.

నల్లగొండ, ఏపీ ప్రొబేషనరీ అండ్ ఎక్సైజ్ అకాడమి, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, స్టేట్ కౌన్సెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, ఏపీ స్టడీ సర్కిల్, ట్రైబల్ కల్చర్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, సంక్షేమ భవన్, ఇంటర్ బోర్డు, ఏపీ స్టేట్ సీడ్స్ సర్టిఫికెట్ ఏజేన్సీ, ఏపీ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజేన్సీ, సెంటర్ ఫర్ ఫారెస్ట్ అండ్ నాచురల్ రీసెర్చ్ మేనేజేమెంట్ స్టడీస్, రంగారెడ్డి, ప్రెస్ అకాడమి, ఏయిడ్స్ కంట్రోల్ బోర్డు, మెడికల్ అండ్ అరోమెటిక్ ప్లాంట్స్ బోర్డు, హైదరాబాద్, పారా మెడికల్ బోర్డు, స్టేట్ కౌన్సెల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, ఫోరెన్సిక్ ల్యాబరేటరీ,

స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, సొసైటీ ఆఫ్ ఏపీ నెట్ వర్క్, ఏపీ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్స్, ఉర్దూ అకాడమి, అర్బన్ సర్వీస్ ఫర్ పూర్, హైదరాబాద్, ఏపీ రూరల్ లైవ్ హెడ్స్ ప్రాజెక్ట్(పీఎంయూ), మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (మెప్నా), వాటర్ కన్‌జర్వేటర్ మిషన్, సొసైటీ ఆఫ్ ఎలిమినేషన్ రూరల్ ప్రావర్టీ, ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్, స్టేట్ రిమూవ్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్, ఓపెన్ స్కూల్ సొసైటీ, గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీ,

ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్‌డబ్లూఆర్‌ఈఐ), స్టేట్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సాయిల్ కన్‌జర్వేషన్ ట్రైనింగ్ సెంటర్, హైదరాబాద్,స్టేట్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఫర్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్, మహాత్మా జ్యోతిరావుఫూలే బీసీ గురుకులాల సొసైటీ, బీసీ కమిషన్, హిందీ అకాడమి, తెలుగు అకాడమి, సంస్కృత అకాడమి, ఓరియెంటల్ మ్యాన్‌స్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, స్టేట్ ఆర్కివ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఆర్‌జీయూకేటీ, జేఎన్‌టీయూ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ,

తెలుగు యూనివర్సిటీ, డాక్డర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సర్వ శిక్ష అభియాన్ అథారిటీ, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్, ఏపీ నేషనల్ గ్రీన్ కార్ప్, సికింద్రాబాద్, డైరెక్టరేట్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిసిన్, ఏఈజీ ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జ్ నెట్ వర్క్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్, ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్, ది సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్స్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్, దాయిరతుల్ మారిఫ్, ఓయూ, ఏపీ స్టేట్ హజ్ కమిటీ, ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్, రాజేంద్రనగర్, ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్,

హసన్‌పర్తి, రాజీవ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ మిషన్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, సొసైటీ ఫర్ సొషల్ ఆడిట్, అకౌంటబులిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ, స్ట్రీనిధి క్రెడిట్స్ కోఆపరేటీవ్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ సర్వే ట్రైనింగ్ అకాడమి, ది అంబేద్కర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ , ఏపీ స్టేట్ కమిషన్ ఆఫ్ ఎస్‌సీ, ఎస్‌టీ, విక్టోరియా మెమోరియల్ హోమ్ (రెసిడెన్షియల్ స్కూల్), హైదరాబాద్, ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం), వైఎస్సార్ స్టడీ సర్కిల్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (పీఈటీసీ), ఏపీ ఉమెన్స్ కమిషన్, ఏపీ సోషల్ వెల్ఫేర్ అడ్వయిజరీ బోర్డు, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్, ది ట్రైనింగ్ సెంటర్ ఫర్ టీచర్స్ ఆఫ్ విజ్వుల్లీ హ్యండీకాప్‌డ్, స్టడీ సర్కిల్ ఆఫ్ డిసేబుల్డ్,

ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎంప్లాయిస్ థ్రిఫ్ట్ (THRIFT) అండ్ క్రెడిట్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్, ట్రక్ ఆపరేటర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ (TOHAS), ఎన్‌సీసీ డైరెక్టరేట్, శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కల్చర్ సొసైటీ, వైఎస్సార్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హస్సాటాలిటీ మేనేజ్‌మెంట్, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరప్సనల్ అడ్మినిస్టేషన్, చంచల్‌గూడ, ఏపీ ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, వీవర్స్ ట్రైనింగ్ సెంటర్, కరీంనగర్, పవర్‌లూమ్ సర్వీస్ సెంటర్, కరీంనగర్, ఖాదీ గ్రామోద్యోగ మహా విద్యాలయ.

అధికారం తెలంగాణకే : అడ్వకేట్ జనరల్ కే రామకృష్ణారెడ్డి


ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న విద్య, శిక్షణ సంస్థల్లో తెలంగాణ పరిధిలో ఉన్న వాటిపై తెలంగాణ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఏపీ ఉన్నత విద్యామండలి అంశంలో ఉమ్మడి హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వు ఇదే విషయాన్ని ధృవీకరించింది. తెలంగాణ పరిధిలో ఉన్న సంస్థల నిర్వహణ, బ్యాంక్ లావాదేవీలు, ఆస్తులపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి నగరంలో సంస్థలపై తమకు అధికారం ఉందని చెప్పే అర్హత ఏపీ ప్రభుత్వానికి లేదని హైకోర్టు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.

కావాలంటే సేవలు వినియోగించుకోవచ్చు:జీ విద్యాసాగర్, సీనియర్ న్యాయవాది


పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థలు ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయంటూ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఒక రాష్ట్రంలో ఉన్న సంస్థ సేవలను మిగితా రాష్ర్టానికి అందించే వెసలుబాటును కల్పించారు. అంతకు మించి ఆ రాష్ర్టానికి అధికారం ఉండదు.
(వార్తకై ఇక్కడ క్లిక్ చేయండి)


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి