గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, అక్టోబర్ 27, 2013

ముగ్గురా? కారు! వారలు మూఁడు కోట్లు!


ఏకపక్ష సమైక్యాంధ్ర హెచ్చులకయి
సభలు నిర్వహించఁగ సమంజసము కాదు!
“నేను విడిపోదు”నను తమ్ముని బలిమిగను
కలిసి జీవించఁగా నాపు కార్య మిదియె? (1)

ఇట్టి సీమాంధ్రులును జేయునట్టి సభను

దెలిపెఁ “దెలగాణ వాణి” సతీశు గౌడు!
“జై తెలంగాణ” నినదమ్ము స్వేచ్ఛగాను
నొక్కఁ డయ్యును నెలుగెత్తె నొక్కసారి! (2)


ఓయు విద్యార్థి జేయేసి యొక్కటి యయి,
సభను నడ్దుకొనంగను సాఁగి వచ్చె!
వారె గడ్డము శ్రీరాము ప్రభృతు! లచట
“జై తెలంగాణ” నినదముల్ స్వేచ్ఛగాను
సలిపి, తెలగాణ కోరికఁ దెలిపినారు! (3)


విషపు సీమాంధ్ర వాక్కుల వినఁగ లేక,
రుద్రుఁడై శివతాండ వోగ్రుండు నగుచు
నడ్డ, నాకుల శ్రీనివాస్ రెడ్డి బూటు
విసరె వేదిక పయికి నుద్విగ్న హృదిని! (4)


ముప్పయొకవేయి వారలు; మువురు వీర;
లైన నేమాయెఁ దెలగాణ మానసమును
దెలిపి రయ్య వీరలు! మేటి ధీరు లయ్య!
ముగ్గురా? కారు! వారలు మూఁడు కోట్లు!
మన తెలంగాణ వీరులు! మాన్యు లయ్య!! (5)


“అడుగఁ దలఁచు కొన్నా”నంచు నడిగి యడిగి,
యన్ని ప్రశ్నలు పసలేని వనియుఁ దెలిసి,
పలికి బొంకినవాఁ డటఁ బల్క, నవియ
యొప్పు లగునె? తప్పులు తప్పె గాని! (6)


సభకుఁ దరలి వచ్చెడునట్టి జనుల నాపి,
నిరసనముఁ దెల్పినారు, నిర్ణీతమైన
భాషణల కృత్యములతోడ వాంఛితమును!
వారు వరదన్నపేఁట్, రాయపర్తి ఘనులు!! (7)


అటులె యడ్డుకొన్నా రయ్య యా సభికుల,
బట్టుపల్లి, కడిపికొండ వాసులపుడు!
నిరసనముఁ దెల్పినను వారి నిర్ణయమును
మార్చుకొనరైరి కఠినులు! మానవులరె? (8)


ఎన్ని సభలను జేసియు, నెన్ని వాగి,
బీరములు వల్కి, బెదరించి, వెఱ్ఱులెత్తి,
యెన్ని తైతక్క లాడిన నేమి యైన,
మన తెలంగాణ రాష్ట్రమ్ము మాన్పఁ గలరె? (9)


ధర్మ మున్నది మనవైపు! దైవ కృపయు
నుండె మన పైన ! న్యాయమే యున్నదయ్య
మనను గాపాడఁగా నిట! మన యుసురులు
తప్పకుండఁగ దోపిడీ దారులకును
దాఁకు నో తెలంగాణ సోదర! నిజముగ
మన తెలంగాణ రాష్ట్రమ్ము మనకు దక్కు!! (10)


జై తెలంగాణ!       జై జై తెలంగాణ!

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

VIllu samayam sandharbham teliyani vallu.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

వాళ్ళకు సమయం విలువా, సందర్భం విలువా తెలియదు కనుకనే ఆదరాబాదరాగా సభలు చేసి, రాజకీయ లబ్ధిపొందడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రజల్ని మోసం చేస్తున్నారు.

అజ్ఞాత చెప్పారు...

Mee padyalu chana bagunnai. Matalo chepalenanta baga rasinru. Kavulu mana telanganalo leru annoniki meere oka answer. Chana santoshanga unnadi.Meeru ilage rayundri. Hats off you sir..

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మీ అభిమానానికి సంతోషం. ఇలాగే ఈ బ్లాగును చూస్తూ, టపాలు చదువుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనా కార్యోన్ముఖులు కావడమే నేను కోరేది.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

వేలమంది సమైఖ్యవాదుల ముందు తెలంగాణా వాదాన్ని నిర్భయంగా తెలియజెప్పిన తెలంగాణా వీరపుత్రుల పొగడుతూ మీరు రాసిన కవిత్వం ఎంతో పరమాద్భుతంగా ఉంది. మీ పదాల్లో పెల్లుబుకుతున్న తెలంగాణా వాదానికి జోహార్లు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు స్వామిగారూ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి