గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 05, 2015

ఆంధ్రజ్యోతా.. ఆంధ్రా జ్యోతా?

-రాధాకృష్ణ ఎవరి ఏజెంటు?!
-ప్రతి అక్షరం అటువైపే
-ప్రతి కథనం ఆ గడ్డ మేలుకే
-నికార్సయిన సీమాంధ్రవాది
-ఆంధ్రా మేలుకే గవర్నర్‌పై కన్నెర్ర
చేసేది దొంగతనం.. దానికి న్యాయం.. అన్యా యం అంటూ గగ్గోలు. రాజ్యాంగం, నిబంధనలు అంటూ ధర్మపన్నాలు. ఆ చట్టం ఇది చెప్పింది. ఈ చట్టం అది చెప్పింది అంటూ లాజిక్కులు. పక్కింటోడి మీద పడి తేరగా మేసే చాన్సు పోతున్నదని పెడబొబ్బలు. ఈ ఘనకార్యానికి చేతులు కలపని వారి మీద నీలాపనిందలు. అక్షరాస్ర్తాలతో బెదిరింపులు. తమను తాము బాగుచేసుకునే తెలివిలేదు. ఇంకోడు బాగుపడితే చూసే సంస్కారం లేదు. తెలంగాణ నడిబొడ్డున కూర్చున్న ఓ సీమాంధ్ర దుష్టశక్తి తీరుతెన్నులివి. కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టి... అన్నట్టుగా మీడియాను అడ్డుపెట్టుకుని పట్టపగలు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నాడు. దారికి రాకుంటే రాస్తాం..రచ్చ చేస్తాం.. అని నేరుగానే హెచ్చరిస్తున్నాడు. ఇంతకూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎవరి ఏజెంటు? తెలంగాణ నడిబొడ్డు మీద తిష్ఠవేసి ఎవరి ప్రయోజనాల కోసం పాటు పడుతున్నాడు?

ముసుగు తీసి విషం చిమ్ముతూ..


ఇవాళ రాధాకృష్ణ ముసుగు తీసేశాడు. నేను తెలంగాణయే అని నిన్నటిదాకా చెప్పుకున్నా...ఇవాళ ఆ ముసుగు తీసేశాడు. తెలంగాణ గడ్డమీద కూర్చుని సీమాంధ్ర కోసం పని చేస్తున్నాడు. తెలంగాణను నాశనం చేయడమే లక్ష్యంగా విషం కక్కుతున్నాడు. గత సంవత్సరం జూన్ 2న తెలంగాణ ఏర్పడినప్పటినుంచి తనలో రగులుతున్న కడుపుమంటను ఆయనే బయటపెట్టుకున్నాడు. ఒకనాడు తానే వీరుడు, శూరుడు అంటూ భుజకీర్తులు తగిలించి నెత్తికెత్తుకున్న గవర్నర్ నరసింహన్ మీద ఇవాళ కత్తులు నూరుతున్నాడు. బాబు కుట్రలకు తలూపకపోవడం ఆయన తప్పు. తెలంగాణకు ఎప్పటికప్పుడు అడ్డంకులు కల్పించకపోవడం ఆయన దోషం. ఏపీ ప్రభుత్వం తెలంగాణ మీద పెత్తనం సాగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడం ఆయన మహాపరాధం. నేను తెలంగాణలోనే పుట్టాను.. తెలంగాణ ఉద్యమానికి ప్రచారం చేశాను అని చెప్పుకున్న రాధాకృష్ణ ఇవాళ తెలంగాణకు గవర్నర్ సహకరిస్తుండడం చూసి బట్టలు చింపుకుంటున్నాడు. 

ఆత్మగౌరవంతో బతకడమే తెలంగాణ దోషమా?..


రాధాకృష్ణ బాధ ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం తన విద్యామండలిని తాను ఏర్పాటు చేసుకోవడం. తన రాష్ట్రంలో తాను పన్నులు వేసుకోవడం. తన ఎన్నికల కమిషన్‌ను తాను ఏర్పాటు చేసుకోవడం. తన ప్రాంతంలో ఉన్న వర్సిటీకి తమ స్ఫూర్తిప్రదాత పేరు పెట్టుకోవడం.. తనకు కావలిసిన భవనాలను తాను తీసుకోవడం.. ఆత్మగౌరవంతో ఇతరుల ప్రమేయం లేకుండా పాలించుకోవడం.. ఇవన్నీ రాధాకృష్ణకు కంటగింపుగా ఉన్నాయి. ఆయన ఏమి కోరుకుంటున్నాడు? తెలంగాణ పరీక్షలను ఏపీ ప్రభుత్వం నిర్వహించాలని.. తెలంగాణ ఎన్నికల మీద ఏపీ పెత్తనం చేయాలని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా ఇక్కడ వర్సిటీలకు, భవనాలకు, పార్కులకు...ఏపీ నాయకుల పేర్లు మాత్రమే ఉండాలని.. తెలంగాణ తనకు కావలిసిన భవనాలు కాకుండా...ఏపీ అధికారులు బాత్‌రూం ఫిట్టింగులు కూడా ఎత్తుకుపోగా మిగిలిన భవనాల్లో మాత్రమే పాలన చేసుకోవాలని.. గవర్నర్ పేరిట పెత్తనం చేయాలనుకుని...చంద్రబాబు కానివ్వండి.. రాధాకృష్ణ కానివ్వండి.. కేంద్రంలో ఎన్డీఏ రాగానే అనేక కలలు కన్నారు. గవర్నర్‌ను అడ్డు పెట్టుకుని తెలంగాణ మీద మళ్లీ తమ పెత్తనం సాగించాలనుకున్నారు. ఇక్కడి ప్రభుత్వానికి అడుగడుగునా ఆటంకాలు కలిగించి ప్రత్యేక రాష్ట్రం వృధా అనిపించాలని కోరుకున్నారు. 

vemuri

సీమాంధ్రపాలనే మెరుగు.. చంద్రబాబే విజనరీ అనే అభిప్రాయం సృష్టించాలని కూడా అనుకున్నారు. కేసీఆర్‌ను అష్టదిగ్బంధం చేసి అసమర్థ ముద్ర వేయాలని కూడా అనుకున్నారు. తమ వ్యూహాలన్నింటికీ గవర్నర్‌ను అడ్డుపెట్టుకోవాలనుకున్నారు. కానీ నరసింహన్ తల వూపడం లేదని ఇవాళ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వాస్తవానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిననాటినుంచి ఏపీ నాయకులకు ఈ ఆలోచనలే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం అనేది నామమాత్రం చేసి ఇక్కడ తమ పెత్తనం నిరంతరం సాగించాలనుకున్నారు. ఓ వివాదం ఇరుపక్షాల మధ్య రాజుకున్న సమయంలో సీమాంధ్రకు చెందిన ఓ రాజకీయ మరుగుజ్జు..తెలంగాణ తగ్గిఉంటే మంచిది. టేబుల్ ఎప్పుడైనా లాగే అవకాశం ఉంది. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది జాగ్రత్త అని చేసిన ఓ హెచ్చరిక సీమాంధ్రుల ఆలోచనా సరళిని తెలుపుతున్నది. 

వత్తాసు పలకలేదని బెదిరింపులు..


నరసింహన్ అంటే నరుడు సింహము అని ఆయన వచ్చిన ఇన్నేళ్లకు రాధాకృష్ణకు తెలిసివచ్చింది. ఆయన ఒక వైపే చూస్తున్నారట. టీ అంటేనే ఆయనకు మక్కువట. తెలంగాణ ఫైళ్లను చకచకా పరిష్కరిస్తున్నారట. అదే ఏపీ ఫైళ్లు తాకడం లేదట. కానీ టీఎస్ పీఎస్‌సీ అనబడే ఫైలు గవర్నర్ దగ్గర చాలాకాలమే పెండింగ్‌లో ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తొందరపడలేదు. గవర్నర్‌పై గౌరవభావంతోనే వ్యవహరించింది. దాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు భర్తీ చేయడం లేదంటూ బాబు అండ్ భాజపా కంపెనీ ఎంతగానో రచ్చ రచ్చచేసింది కూడా. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసుకుంటే గవర్నర్ ఓకే అనడం కూడా రాధాకృష్ణకు తప్పుగా తోచింది. అంటే తెలంగాణ ఏపీ ఎన్నికల కమిషన్‌ముందు చేతులు కట్టుకుని ఉండాలని ఈ సీమాంధ్రుడు కోరుకున్నాడు. అలాగే ఉమ్మడి ప్రవేశ పరీక్షల వివాదంలో తమకు గవర్నర్ కొమ్ము కాయనందుకు కూడా కోపం వచ్చేసింది. అసలు ఉమ్మడి పరీక్షలు ఎవడికి లాభం? విద్యార్థులకు ఏ రకంగా లాభం? తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా తన విద్యావ్యవస్థను తాను రూపుదిద్దుకోకూడదా? తన సిలబస్, తన పరీక్షా విధానం తయారు చేసుకోకుండా ఏపీ కింద పడిఉండాలా?....పడే ఉండాలట!!! విభజన చట్టంలో పదేండ్లు అని ఉన్నదట. అంటే పదేండ్లు విద్యారంగాన్ని ఏపీకి అప్పగించి చేతులు కట్టుకుని వాళ్ల హుకుంలు పాటించాలన్న మాట. విభజన చట్టంలో ఉన్నా గవర్నర్ పాటించలేదట.

మరి ఉమ్మడి చట్టంలో పోలవరం ముంపు ఉన్నదా? లేనిది అమలు చేసినపుడు ఈయన నోరు ఎందుకు పెగలలేదు. పెగలదు.. ఎందుకంటే ఏపీకి మేలు కదా? ఇక కార్మిక శాఖ నిధుల విషయంలో గవర్నర్ సహకరించలేదని కూడా నిస్సిగ్గుగా చెప్పుకున్నాడు. మాజీ పోలీసు అధికారి అయిన నరసింహన్‌నుంచి ఓ దొంగతనానికి సర్టిఫికెట్ ఆశించడం వింతల్లో వింత. పైగా తమ ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించేవారు కాదని, తెలంగాణ అంటే చాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేవారని అధికారులు ఈయన చెవుల్లో ఊదారట. న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన అంశాలకు ఎవరైనా గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. ఆ సంస్కారం గవర్నర్‌లోనూ ఉంది. అలా న్యాయబద్దమైన విధానాలు మాత్రమే గవర్నర్‌కు నివేదించే సంస్కారం తెలంగాణకు ఉంది. ఏపీ తెచ్చేవన్నీ తెలంగాణకు మోకాలడ్డే...నాశనం చేసే ప్రతిపాదనలే అయినపుడు ఎలా ఆమోదిస్తారు? తెలంగాణ టాక్స్‌లు వేయకుండా అడ్డు పడాలంటారు. సంస్థలు ప్రత్యేకం కాకుండా మోకాలు అడ్డమంటారు. పరీక్షలు ఆపేయాలంటారు. ఒక ఇంటి పెద్దగా గవర్నర్ అలాంటి ప్రతిపాదనలకు ఆమోదం చెబుతారా?

అనుభవం అన్నీ నేర్పింది..


నరసింహన్ గవర్నర్‌గా ఒక చారిత్రక సందర్భంలో వచ్చారు. నిబద్ధతతో ఇక్కడ పనిచేశారు. అప్పటినుంచి ఇరు రాష్ర్టాల పరిస్థితులను, ప్రజలను..నేతలను.. మీడియాను కూడా పరిశీలించి ఉంటారు. ఇక్కడ జరిగిన జరుగుతున్న అన్ని కుట్రలు కుతంత్రాలు కళ్లతో చూసి ఉంటారు. న్యాయాన్యాయాలన్నీ బేరీజు వేసుకుని ఉంటారు. ధనమదంతో దురహంకారంతో వ్యవహరించేది ఎవరన్నది ఆయన దృష్టికి వచ్చే ఉంటుంది. ఎవరిది న్యాయం.. ఎవరిది అన్యాయం అనే విషయంలో ఆయనకు సంపూర్ణ అవగాహన ఉన్నది. ఇవాళ ఎవరితో ఎలా వ్యవహరించాలన్నది ఎవరో అంగుష్ఠమాత్రుల సలహాల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. రాస్తాం.. రచ్చ చేస్తాం అనేది క్రీస్తుపూర్వం నాటి బెదిరింపులు... ఉగ్రవాదులు, తీవ్రవాదులనే ఎదుర్కున్న ఒక మాజీ పోలీసు అధికారిని భయపెట్టజాలవు. ఇవాళ నరసింహన్ మీద కత్తులు నూరుతున్న రాధాకృష్ణ, సీమాంధ్ర మీడియా ఒకనాడు ఆయన నియామకాన్ని ఎంతగా హర్షించింది? ఆయన రాకకు ఎలా స్వాగతించింది? ఆయన వ్యవహారశైలిని ఎంతగా ఆకాశానికి ఎత్తింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆయన చర్యలు..శాంతిభద్రతల అంశాల్లో ఆయన విధానాలు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఆయన నివేదికలపై ఎన్నెన్ని కథనాలు రాసి ఎంతగా మెచ్చుకుంది.. ఎంతగా ముచ్చట పడింది.. తెలంగాణపై రాధాకృష్ణ చిమ్మిన విషం ఎంత..అందులో విషయం ఎంత..

ఇదే గవర్నర్ గురించి గతంలో ఏమన్నాడు?


గవర్నర్ నరసింహన్.. ఆయనో సంచలనం. ఆయన పనితీరే ప్రత్యేకం. నేతలు, అధికారులు, పోలీసులు, చివరికి వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్లనుంచి అందరికీ ఆయన క్లాసులు తీసుకుంటున్నారు. ......గవర్నర్ అంటే ఇలా ఉంటారా అనిపించుకుంటున్నారు. ఆయన పనితీరు రాజకీయ వర్గాల్లో, అధికారుల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ ఉద్యమం అదుపు తప్పిన నేపథ్యంలో ఆయన పగ్గాలు చేపట్టి శాంతి భద్రతలు గాడిలో పెట్టారు.... ఆ రోజున నరసింహన్ ఆంధ్రజ్యోతికి తెగ నచ్చారు. ఇవాళ మాత్రం కంటిలో నలుసుగా కనిపిస్తున్నారు. అంతేమరి...లోకో భిన్నరుచి....తలకో బుద్ధి..జిహ్వకో రుచి...తా మునిగింది గంగ...తా మెచ్చింది గంగ...

(క్లిక్ చేయండి: నమస్తే తెలంగాణ వార్త)


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి