గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మార్చి 28, 2014

ఏమిచేయ వచ్చినాడో, ఏమో?


పవన్ బాబు పార్టి పెట్టి
మోదీనే కలువనేల?
వాపు చూచి బలుపనుకొను
అభిమానుల నమ్మనేల?

జీవితమ్ము నటనకాదు,
నటనము జీవితముకాదు!
సినిమాలో హీరొ ఐన
జీవితాన హీరోనా?

పవనుబాబు కర్హతలే
ఏమున్నవి, ఏమున్నవి?
ఏ ఘనకార్యమ్మైనను
సాధించిన చరితుందా?

సమతావాదము అనుచును
మత ద్వేషిని కలువనేల?
అన్నతోడ సఖ్యత విడు
వాడే సౌభ్రాతృడెట్లు?

స్వంతపార్టి తనకుండగ
పరపార్టిని  జేరనేల?
పరపార్టిని కోరినచో
స్వంతపార్టి ఎందుకొరకు?

భవిష్యతును దర్శించెడి
ముందు చూపు అతనికున్న
నేరుగానె ప్రజలోకి
వెళ్ళకుండ నాన్చనేల?

తర్జన భర్జన లేలొకొ
మంచిపనిని చేసేందుకు?
ముహూర్తమ్ము పెట్టవలెనె,
మంచిపనిని చేసేందుకు?

కుటుంబాన్ని గెలువకుండ,
సమాజాన్ని గెలుచునెట్లు?
అన్నతోడ పంచాయితి,
పరులతోడ సఖ్యతయా?

ఆదర్శమ్మిదియగుచో
తప్పక యిది తప్పెయగును!
స్వకుటుంబము పామైనచొ
సమాజమే ఏమగునొకొ?

సమాజాన ఇందరుండ
తాను ఏమి ఒరగబెట్టు?
అవినీతిని తొలగించుచొ
అవినీతిపరుడె వలెనా?

మతత్త్వముతోడ జనుల
చంపించిన వానితోడ
సఖ్యము చేయుట జూడగ,
అవినీతిని కాచువాడె!

కాంగ్రెస్ నిర్మూలనమ్ము
ఎజెండయే అతనికగుచొ,
మోడీనే కలువనేల?
ఇతడు నీతిమంతుడనా?

నటనతోడ మెప్పింపగ
ఇది సినిమా కాదుసుమా!
జీవితమున నటియించిన
తరిమికొడుదురయ్య జనము!!

అన్నపైన కక్ష తోడ
అన్నపార్టి నాశనమును
కోరుకొనుట చూడగాను
ప్రతీకారమగునెట్టులు?

ఎలుకపైన కోపముతో
ఇల్లు తగులబెట్టెదరా?
అన్నపైన కోపముతో
అన్నపార్టి కూల్చెదరా?

అన్న శత్రువును గూడిన,
లోకమెట్లు మెచ్చునతని?
ప్రత్యేకత ఏమున్నది
ఈ పట్టున అతనికిపుడు?

ఏమి జూచి అతని మెచ్చు
కొందురయ్య ఈ జనమ్ము?
నటన కాదు చూపుటిచట,
రూఢిగాను మెలగవలయు!

నటనపైని క్రేజీతో
అందరతని వెంటపడిన,
క్రేజీ నిజజీవితమున
సాయపడదు, ప్రతిభ వలయు!

ఓట్లకొరకు పుట్టినట్టి
పార్టీయే ఇది ఐనచొ,
మానిఫెస్టొ ప్రకటించక
ఊరకుండనేలనయ్య?

ఈ పార్టీ ఉనికెక్కడ?
సీమాంధ్రలొ మనుతుందా,
తెలగాణలొ మనుతుందా,
లేక రెంట ఉంటుందా?

సమైక్యాంధ్ర నినాదమా,
ప్రత్యేకత నినాదమా?
రెండు నినాదా లన్నచొ
తరిమికొట్టెదరు వెంటనె!

జనసేనకు నాయకుడే
అతడైనచొ, మోది ఎవరు?
వెనుకనుండి నడిపించెడి
దైవమ్మే అతడగునా?

తెలంగాణ ఉద్యమమున
మాతోడను కలిసినాడె?
"జై తెలంగాణ" అనియు
ఎప్పుడైన పలికినాడె?

ఏమిలేని అతడు మాకు
ఏలకయ్య నాయకుడుగ?
ఇంతటి ఘన నాయకుండు
మాకు లేడు అని జాలా?

ప్రశ్నలపై ప్రశ్నలిపుడు
పుట్టుచుండగాను, అతడె
సందేహ నివృత్తిజేయ
వలయునయ్య ఈ క్షణమున!

తెలగాణకు ఆతడిపుడు
ఏమి చేయబూనినాడొ
శీఘ్రముగా వచియించిన
తెలగాణులు ఆదరింత్రు!

తెలగాణకు విఘాతమును
కలిగించుచొ తరిమికొట్టి,
తిరిగిచూడకుండ అతని
చేయుదురయ తెలగాణులు!

నాటకాలు మొదలిడుచో
చెవిని పువ్వు పెట్టి లేని
తలగాణులు తరిమికొట్టి
మరలి చూడనీయరతని!

ఆదర్శము వల్లించుచొ,
నీతిమంతుడై రావలె!
విశ్వప్రేమ చూపినచో
అన్నతోడ రావలయును!!

ఏదీలేకయె వచ్చుచొ
రావలసిన పనిలేదయ!
ఇంతోటి ఘనధీరుండు
తెలంగాణలో లేడా?

నటనలు చాలించి ఎచటి
నుండి వచ్చెనో అచటికె
తిరుగు ప్రయాణమ్ము కట్టి
మరలిరాక పోవలయును!

(ఇంతటి విశ్వవిఖ్యాత నటసార్వభౌములూ, నటసమ్రాట్టులూ, నటభూషణులూ, నటశేఖరులూ మాకు వద్దు! మాకు మా తెలంగాణ బంగారు తెలంగాణ ఐతే చాలు!!)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

Good, Sharp, Straight, Open, Fair and Constructive Comments .......Gundanna!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు భయ్యా! ఇలాగే అనునిత్యం ఈ బ్లాగును వీక్షిస్తూ ఉండాలని మనవి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి