గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మార్చి 27, 2014

"మేమే తెలంగాణ ఇచ్చాం..."


తెలంగాణ రాష్ట్రమ్మును
కాంగ్రెస్సే తెచ్చినదని
జబ్బచరచుకొనుట ఏల?
పుణ్యానికె ఇచ్చినదా?

అరువదేండ్ల బానిసత్వ
మును మాన్పగ బూని, నాడు
టీఆరెస్ ఉద్యమమును
చేసినదియె మరచితిరా?

టీఆరెస్ ముందు నడువ,
ఉద్యోగులు, విద్యార్థులు,
వ్యాపారులు, కుల సంఘాల్,
కార్మికులును ఏకమైరి!

వేయిమంది తెలంగాణ
ఉద్యమమున అమరులైరి!
ఉద్యమకారుల పైనను
పోలీస్ కేసులు వెలసెను!!

యూనివర్సిటీలందున
విద్యార్థులు ఉద్యమమున,
లాఠీలూ, బాష్పవాయు
ప్రయోగాలు ఎదుర్కొనిరి!

ఇంత జరుగుచున్నగాని,
టీకాంగ్రెస్ మంత్రులపుడు
ప్రభుత్వమును ఎదిరించియు
రాజినామ చేసినారె?

ముఖ్యమంత్రులకు వంతలు
పాడుచు, పదవులను పట్టి
వేలాడుచు ఉండ్రిగాని,
ఉద్యమమున చేరినారె?

కేసీఆర్ నిరాహార
దీక్ష, ప్రజల ఉద్యమమ్ము,
ఇంతమంది బలిదానము
తెలగాణను తెచ్చెనయ్య!

ఇప్పటి వరకును వారలు
గబ్బిలములవోలె పదవి
పట్టుకొనియు వ్రేలాడుచు,
మేమె తెచ్చితిమన నగరె?

పద్నాలుగు వత్సరాలు
ఇంత జరిగితేనె గాని,
కాంగ్రెస్సున చలనమ్మే
రాలేదని మరచినారె?

టీఆరెస్ లేకున్నచొ
ఉద్యమమ్ము జరిగేదా?
తెలంగాణ రాష్ట్రమ్మే
నేడు వచ్చి ఉండేదా?

గాలేరు-నగరి, వెలిగొం
డ, వెలిగోడు, హంద్రినీవ
లక్రమ ప్రాజెక్టులు! వీటికి
కేటాయింపులు ఉన్నవె?

ఇట్టి వీటి కనుమతులను
పొన్నాలయె ఈయలేదె?
తెలంగాణ నీటినిట్లు
దోచి సీమ కీయలేదె?

ఇట్టి అక్రమములు మీరు
ఎన్నొచేసి,ఇపుడు "మేము
చొక్కం బంగార" మనుచు
చెప్పినచో నమ్మెదరే?

ఎవరు ద్రోహమును చేసిరొ
ఇప్పటికిని ఎరుగలేని
ప్రజలు కారు తెలగాణులు!
చెవిని పూలు పెట్టి లేరు!!

ఎవరివలన తెలంగాణ
వచ్చినదో ఎరుగలేని
ప్రజలు కారు తెలగాణులు!
చెవిని పూలు పెట్టి లేరు!!

తెలంగాణ తెచ్చితిమని
మీరు చెప్పగానె, తలలు
ఊపి, మిమ్ము నెగ్గించెడి
కృతఘ్నులీ తెలగాణులె?

కృతజ్ఞతను తెలుపునట్టి
సంస్కారులు తెలగాణులు!
బంగరు తెలగాణ నెవరు
తెత్తురొ తెలియును వారికి!!


మరిన్ని వివరములకు

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి