గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఫిబ్రవరి 13, 2014

"బేషరతు" అన్నవారు..."షరతు"లకు దిగజారారు!

[బేషరతుగా తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామన్న బీజేపీ ఇప్పుడు మాటమార్చింది. తెలంగాణకు సంపూర్ణంగా మద్దతిస్తామంటూనే, సీమాంధ్రకు న్యాయంచేయాలనే  షరతులతో కూడిన మద్దతు తెలపడం గమనార్హం. ఈ బిల్లులో తెలంగాణకు నష్టం కలిగించే అంశాలపై తెలంగాణ నేతలు సూచించిన సవరణలను  చేయకుండానే కేంద్రం, బిల్లును పార్లమెంటులో  ప్రవేశపెడుతోంది. ఈ సమయంలో బీజేపీ, సీమాంధ్రకు న్యాయం చేయడంతో పాటు, తెలంగాణ రాష్ట్రప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాల సవరణకు కూడా పూనుకొంటేనే తెలంగాణలో మనుగడ ఉంటుంది. అయితే బీజేపీ అధినేతలు వెంకయ్యనాయుడుకిచ్చినంత ప్రాధాన్యత తెలంగాణ బీజేపీ నేతలకు ఇవ్వకపోవడం బాధాకరం. ఇందుకు బీజేపీ, తెలంగాణ సవరణల విషయం ప్రస్తావించకుండా, కేవలం సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరడమే నిదర్శనం. ఐతే, తెలంగాణ ప్రయోజనాలను కాపాడని ఏ పార్టీకైనా తెలంగాణలో మనుగడ ఉండదనేది స్పష్టం. దానికి బీజేపీ సిద్ధపడే ఉందా? అనే అనుమానం తెలంగాణులకు ఉంది. ఇది తేల్చుకోవలసిన అవసరం తెలంగాణ బీజేపీ నేతలకు ఉంది!]


తెలంగాణ బిల్లునకును
బేషరతుగ మద్దతిడుదు
మని తెలిపియు, మాటమార్చి
షరతులకును దిగజారిరి!

సీమాంధ్రకు న్యాయమ్మును
చేయాలని అనుచుండిరి!
తెలంగాణ నష్టపఱచు
అంశమ్ముల మాటెత్తరు!!

దగాపడిన తెలంగాణ
మున కీబిల్లున మోసమె
జరుగుననియు తెలిసికూడ
సవరింపగ బూనుకొనరు!

ఒక్కటి తేలుచునున్నది!
బీజేపీ మద్దతంత
సీమాంధ్రుల న్యాయముకే!
తెలగాణకు కానె కాదు!!

బీజేపీ తెలంగాణ
లోన నెగ్గకున్న వెలితి
ఏమియు కాదని తలచుట,
చూడగ వెంకయ్య కుట్రె!

తెలంగాణ నేతలిపుడు
వ్యతిరేకింపగవలయును
తెలంగాణ సవరణములు
తప్పక నెగ్గించుకొఱకు!!

వెంకయ్యను ఒక తీరుగ,
తెలగాణుల నొక తీరుగ
బీజేపీ అధినేతలు
చూచిరనుట పచ్చినిజం!

తెలంగాణ బిల్ సవరణ
కేంద్రమిపుడు సరకుగొనక,
బీజేపీ సరకుగొనక,
అన్యాయము నొందవలెనె?

సీమాంధ్రకు ప్రయోజనాల్
కోరుచున్నవారలిపుడు
తెలంగాణ ప్రయోజనాల్
మంటగలుపగానేలా?

సీమాంధ్రకు ప్రయోజనాల్
కోరుచునే, తెలంగాణ
ప్రయోజనాల్  కాపాడెడి
సవరణములు చేయింపుడు!

రాజకీయ లబ్ధిలేని
పార్టి యేది బ్రతుకలేదు!
తెలగాణకు లబ్ధియిడని
పార్టీయిట బ్రతుకలేదు!!

షరతులు సీమాంధ్రులకును
సగము, తెలంగాణులకును
సగము విధించినచొ మేలు
జరుగును ఇరుప్రాంతములకు!

లేకున్నచొ బీజేపీ
పుట్టి మునుగు తెలగాణలొ!
తేల్చుకొనుడు, సమకట్టుడు
ఇరువైపుల వెలుగొందుడు!!

ఎట్టి పరిస్థితులలోను
తెలంగాణమేర్పడునయ!
రాష్ట్రమేర్పడిన పిమ్మట
వృద్ధిని సాధింతుమయా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

పుల్లాయన చెప్పారు...

seemandhra ki nyayam cheyamante tappEnto konchem selavu istara? they never said they are opposed to Telangana

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

>seemandhra ki nyayam cheyamante tappEnto konchem selavu istara? they never said they are opposed to Telangana

ఓ పుల్లాయనా,
ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావు? నీవు మాట్లాడేది అసత్యం. సీమాంధ్ర నేతలకు తెలంగాణను దోచుకోవడంలో సహకరించడమే సీమాంధ్రులు చేసిన పెద్ద తప్పు. ఈ దగుల్బాజీలు, పెత్తందార్లు తమ వ్యాపార స్థిరత్వానికి, తమ ఆస్తుల రక్షణకై సమైక్యాంధ్ర నినాదం చేపడితే, వారికి వంతపాడుతూ సహకరించడమే సీమాంధ్రులు చేస్తున్న పెద్దతప్పు.

దోపిడీకి గురైన తెలంగాణకు అన్యాయం చేసే అంశాల్ని సవరించమనకుండా, దోచుకున్నవాళ్ళకే న్యాయం చేయమనడం అన్యాయం కాదా?

అరవైఏండ్లనుండి అన్యాయానికి గురైంది తెలంగాణులు! న్యాయం చేయమంటున్నది సీమాంధ్రులకు! ఇది పొసగుతున్నదా?

నీళ్ళు, ఉద్యోగాలు, వనరులు, భూములు మొదలైన వాటిని మీరు దోచుకుంటే, దోపిడీకి గురైంది మేము. ఆ దోపిడులకు బ్రేకు వేయకుండా, ఇంకా పదేళ్ళపాటు కొనసాగించడానికి పచ్చజెండా ఊపుతోంది బిల్ లోని అంశాలు. వాటిని సవరించమంటున్నాం మేం. న్యాయం చేయడానికి, సీమాంధ్ర అన్యాయానికి గురైందా, తెలంగాణా అన్యాయానికి గురైందా? సీమాంధ్రకెన్ని ప్యాకేజీలైనా ఇవ్వనీయండి, మాకు అనవసరం. కానీ, మాపై ఇంకా దోపిడీ కొనసాగడానికి మేం ఎంతమాత్రమూ ఒప్పుకోం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి