గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఫిబ్రవరి 01, 2014

అపర విష సర్పాలు!


పత్రికొక్కటి ఉన్నచో పది
వేల సైన్యమటంచు చెప్పుచు,
సత్యమును విడనాడి, విషమును
కక్కగానేలా?

వార్తయందున జగము నడచున
టంచు చెప్పిన కవుల సూక్తిని
సరకు సేయక నేడు విషమును
కక్కగానేలా?

ప్రజల కెప్పుడు యథార్థమ్మును
శీఘ్రగతితో తెలియజేయక,
ఆంధ్రమీడియ నేడు విషమును
కక్కగానేలా?

ఎలక్ట్రానికు, ప్రింటు మీడియ
లిపుడు చేయుచునున్న ధౌర్త్యము
వాటి నైజము బహిర్గతముగ
చేయుచున్నవయా!

ఇంత విషమును కక్కుటేలా?
అసత్యమ్ములు రాయనేలా?
తెలంగాణులు తమకు చేసిన
ద్రోహమేమిటయా??

"బిల్లు" విజయము ప్రక్కనుంచియు,
కపట నోటీస్ గెలిచెనంచును
తెలంగాణము పైన విషమును
కక్కగానేలా?

చర్చ ముగిసిన పిదప బిల్లును
ఎటు తిరస్కరణమ్ము చేతురు?
అనెడి జ్ఞానము తమకు లేకయె
విషము కక్కుదురా??

ఆర్టికలు మూడున కసెంబ్లీ
రూలు డెబ్బది ఏడునకును
ఎట్టి సంబంధమ్ముగలదో
తెలియదా తమకున్?

తెలిసి తెలిసి యసత్యవార్తలు
రాయుటకు మన సెట్టులొప్పెను?
అపర విషసర్పాల వలె మము
కాటు వేయుదురా?

అధర్మయుత సీమాంధ్ర పక్షము
జేరి వారల మెప్పుబడయగ
ధర్మపక్షులు తెలంగాణుల
మోసగింతురొకో?

ధర్మపక్షము నిలువుడయ్యా,
న్యాయమును కాపాడుడయ్యా,
విషముకక్కుట మానివేసియు
మెప్పుగొనుడయ్యా!!

వృత్తి ధర్మము నిర్వహించియు
ప్రజలలో ఘనకీర్తి పొందియు
పత్రికలె మన బలమటంచును
నిరూపింపుడయా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి